తెలంగాణలో 64 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు

తెలంగాణలో 64 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు
  • అంతా అయిపోయాక మేలుకున్న ప్రభుత్వం
  • మంత్రులనూ డోంట్ కేర్ అంటున్న ఆస్పత్రులపై చర్యలకు సన్నాహాలు

హైదరాబాద్: కరోనా చికిత్స పేరిట అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న కార్పొరేట్​, ప్రైవేట్​ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందుకున్న 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దాదాపు అన్ని ఆస్పత్రులపై ఆరోపణలు వస్తున్నా.. కేవలం 15 ఆస్పత్రులపై 2 అంతకంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని, మిగిలిన ఆస్పత్రులపై ఒక్కో ఫిర్యాదు మాత్రమే అందిదంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  మొత్తం 64 ఆస్పత్రులపై
కేవలం 88 ఫిర్యాదులు అందాయని అధికారులు చెబుతున్నారు.

నోటీసులు జారీ చేసిన ఆస్పత్రుల జాబితా పరిశీలిస్తే కేవలం లిఖిత పూర్వక ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకితీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులపై సంతృప్తికరమైన సమాధానాలు రాకపోతే  తనిఖీలు చేసి జరిమానాల వంటి చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్డులు చెల్లవు.. క్యాష్ కట్టాల్సిందేనని చెబుతున్న ఆస్పత్రులను వదిలేసి కేవలం తమకు గిట్టని ఆస్పత్రులపై ఫిర్యాదులనే పరిగణలోకి తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేలా ఉంది జాబితా చూస్తుంటే. షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆస్పత్రులు, వాటిపై వచ్చిన ఫిర్యాదులల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి:

1.ఓమ్ని ఆసుపత్రి,కూకట్ పల్లి =6 ఫిర్యాదులు
2.VINN హాస్పిటల్, బేగంపేట = 5 ఫిర్యాదులు
3.TX హాస్పిటల్, కాచిగూడ = 3 ఫిర్యాదులు
4.ఉదయ్ ఓమ్ని హాస్పిటల్, అబిడ్స్ = 3 ఫిర్యాదులు
5.గ్లోబల్ హాస్పిటల్, ఎల్బీ నగర్ = 2 ఫిర్యాదులు
6.లైఫ్ లైన్ మెడిక్యూర్ హాస్పిటల్, ఆల్వాల్ = 2 ఫిర్యాదులు
7.లోటస్ హాస్పిటల్, లక్డికాపూల్ = 2 ఫిర్యాదులు
8.MAX HEALTH, కూకట్ పల్లి = 2 ఫిర్యాదులు
9.మ్యాక్స్ కేర్ (MAX CARE)హాస్పిటల్, వరంగల్=2 ఫిర్యాదులు
10.పద్మజ హాస్పిటల్, కూకట్ పల్లి = 2 ఫిర్యాదులు
11.సాయి సిద్ధార్థ హాస్పిటల్, షాపూర్ నగర్ =2 ఫిర్యాదులు
12.సాయి లైఫ్ హాస్పిటల్, కొండాపూర్ = 2 ఫిర్యాదులు
13.శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, కూకట్ పల్లి = 2 ఫిర్యాదులు
14.శ్రీకర హాస్పిటల్, సికింద్రాబాద్ = 2 ఫిర్యాదులు
15.విఆర్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్, న్యూ బోయిన్ పల్లి = 2 ఫిర్యాదులు
16.ఆదిత్య హాస్పిటల్, ఉప్పల్ = 1 ఫిర్యాదు
17.అజ్రా హాస్పిటల్, హన్మకొండ = 1 ఫిర్యాదు
18.అంకం హాస్పిటల్, నిజామాబాద్ = 1 ఫిర్యాదు
19.అంకుర హాస్పిటల్, ఎల్బీనగర్  = 1 ఫిర్యాదు
20.అపోలో హాస్పిటల్, హైదర్ గూడ = 1 ఫిర్యాదు
21.అరుణ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్, హస్తినాపురం = 1 ఫిర్యాదు
22.ఆషా హాస్పిటల్, కాప్రా  1 ఫిర్యాదు
23.అశ్విన్స్ హాస్పిటల్, పంజాగుట్ట = 1 ఫిర్యాదు
24.ASTER ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట్ = 1 ఫిర్యాదు
25.కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ =1 ఫిర్యాదు 
26.సెంచురీ హాస్పిటల్స్ , బంజారా హిల్స్ = 1 ఫిర్యాదు
27.కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలి = 1 ఫిర్యాదు
28.హ్యాపి హాస్పిటల్, మదినాగూడ = 1 ఫిర్యాదు
29.హర్ష హాస్పిటల్, చందానగర్ = 1 ఫిర్యాదు
30.హైదరాబాద్ నర్సింగ్ హోం = 1 ఫిర్యాదు
31.ఇమేజ్ హాస్పిటల్స్, అమీర్ పేట = 1 ఫిర్యాదు
32.ఇంటెగ్రొ హాస్పిటల్, మెహదీపట్నం = 1 ఫిర్యాదు
33.జయ నర్సింగ్ హోం, హనుమకొండ = 1 ఫిర్యాదు
34.కిమ్స్, కొండాపూర్ = 1 ఫిర్యాదు
35.KIMS, సికింద్రాబాద్ = 1 ఫిర్యాదు
36.లలిత హాస్పిటల్, వరంగల్ = 1 ఫిర్యాదు
37.మ్యాక్సిక్యూర్ హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్ = 1 ఫిర్యాదు
38.మెడిసిస్ హాస్పిటల్, చింతకుంట = 1 ఫిర్యాదు
39.యన్ కేర్ హాస్పిటల్, ఆర్సీపురం, పటాన్ చెరు =1 ఫిర్యాదు
40.నవజీవన్ హాస్పిటల్, కార్ఖానా =1 ఫిర్యాదు
41.నీలిమ హాస్పిటల్, సనత్ నగర్ =1 ఫిర్యాదు
42.నిఖిల్ హాస్పిటల్, శ్రీనగర్ కాలని=1 ఫిర్యాదు
43.ఒమెగా బన్ను హాస్పిటల్, వరంగల్ = 1 ఫిర్యాదు
44.ఓమ్ని హాస్పిటల్, కొత్తపేట = 1 ఫిర్యాదు
45.పంచవటి హాస్పిటల్, భూత్ పూర్ = 1 ఫిర్యాదు
46.ప్రసాద్ హాస్పిటల్స్, మియాపూర్ = 1 ఫిర్యాదు
47.ప్రతిమ హాస్పిటల్, కూకట్ పల్లి=1 ఫిర్యాదు
48.రాఘవేంద్ర హాస్పిటల్, బోయిన్ పల్లి =1 ఫిర్యాదు
49.రక్ష హాస్పిటల్, ఎల్బీ నగర్ = 1 ఫిర్యాదు
50.రెనోవా నీలిమ హాస్పిటల్స్, సనత్ నగర్ = 1 ఫిర్యాదు
51.సాయిరామ్ హాస్పిటల్, సంగారెడ్డి = 1 ఫిర్యాదు
52.షాలిని హాస్పిటల్, బర్కత్ పుర = 1 ఫిర్యాదు
53.షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్, చైతన్యపురి, దిల్ షుక్ నగర్ = 1 ఫిర్యాదు
54.శారద హాస్పిటల్, ఘట్ కేసర్, = 1 ఫిర్యాదు
55. శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, నిజాంపేట్ = 1 ఫిర్యాదు
56.స్టార్ హెల్త్ కేర్ హాస్పిటల్స్, హన్మకొండ = 1 ఫిర్యాదు
57.సన్ రిడ్జ్ హాస్పిటల్, మోతినగర్ = 1 ఫిర్యాదు
58.సన్ షైన్ హాస్పిటల్, మోతీ నగర్ =1 ఫిర్యాదు
59.సన్ షైన్ హాస్పిటల్, సికింద్రాబాద్ =1 ఫిర్యాదు
60.సుప్రజ హాస్పిటల్, సికింద్రాబాద్ = 1 ఫిర్యాదు
61.థంబే హాస్పిటల్, మలక్ పేట = 1 ఫిర్యాదు
62.ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, మలక్ పేట=1 ఫిర్యాదు
63.ట్రిడెంట్ హాస్పిటల్స్, శంషాబాద్ = 1 ఫిర్యాదు
64.టీఎక్స్ (TX) హాస్పిటల్, ఉప్పల్ = 1 ఫిర్యాదు. 
మొత్తం 64 ఆస్పత్రుల నుంచి 88 ఫిర్యాదులు అందాయని ప్రకటించిన అధికారులు.