‘మా నాన్న కేసును విచారించిన జడ్జిని బ్లాక్‌మెయిల్‌చేసి, బలవంతంగా దోషి అని తీర్పిచ్చేలా చేశార’ని పాక్‌మాజీ ప్రధాని నవాజ్షరీఫ్కూతురు మరియం నవాజ్సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి విషయంలో న్యాయవ్యవస్థ మొత్తం రాజీ పడిందని విమర్శించారు. దీనికి రుజువుగా పాక్ న్యాయమూర్తి ఒకరు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్న వీడియోను ఆమె విడుదల చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం కేసులో నవాజ్‌షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణ సరిగ్గా జరగలేదని, తమకు అన్యాయం జరిగిందని మరియం మొదట్నుంచీ ఆరోపిస్తున్నారు. రాజకీయంగా కక్ష సాధించేందుకు తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పనామా పేపర్స్సహా షరీఫ్ఆరోపణలు ఎదుర్కున్న మరో రెండు కేసులను పాక్‌కోర్టు గతేడాది విచారించింది. నవాజ్‌షరీఫ్‌ను ఇస్లామాబాద్కోర్టు జడ్జి అర్షద్మాలిక్దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే, ఆ తీర్పు తనకుతానుగా ఇవ్వలేదని, కొన్ని శక్తులు తనను బెదిరించడం వల్లే ఆ తీర్పిచ్చానని మాలిక్ ఓ వీడియోలో చెప్పారు. నిజానికి షరీఫ్అవినీతికి పాల్పడ్డారనేందుకు ఎలాంటి సాక్ష్యం లేదన్నారు. అయినా సరే షరీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వాలని బెదిరించడం వల్ల ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధించానని పీఎంఎల్ పార్టీ మద్దతుదారుడు నాసిర్భట్ తో చెప్పారని మరియం వివరించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆమె మీడియాకు విడుదల చేశారు.
వీడియో క్లిప్‌పై అనుమానాలు
మిరియం విడుదల చేసిన వీడియో క్లిప్‌పై ఇమ్రాన్ఖాన్సర్కారు అనుమానం వ్యక్తం చేసింది. అది మార్ఫింగ్‌చేసిన వీడియో అని ఆరోపించింది. సదరు వీడియోపై ఫోరెన్సిక్ఆడిట్జరిపించాలని చెప్పింది. తప్పుడు వీడియోతో మరియం న్యాయ వ్యవస్థపై దాడి చేస్తోందని విమర్శించింది.
