IPL 2026: ఇదేం బ్యాటింగ్ రా బాబు.. 26 పరుగులకే 4 వికెట్లా!

IPL 2026: ఇదేం బ్యాటింగ్ రా బాబు.. 26 పరుగులకే 4 వికెట్లా!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా ల‌క్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి బిగ్ షాక్ తగిలింది. కేవలం 5 ఓవర్లు ముగిసే సమయానికి కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది. కేవలం 26 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్, నితీష్ రాణా, పథుమ్ నిస్సంక, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు వరుసగా అవుట్ కావడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. 

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్దేశించిన 141 పరుగుల టార్గెట్ ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) మహ్మద్ షమీ బౌలింగ్ (0.1)లో తొలి బంతికే మోహ్సిన్ ఖాన్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీస్ రాణా కూడా పెద్దగా పరుగులు ఏం చేయలేదు.. 15 రన్స్ చేసిన తర్వాత మోహ్సిన్ ఖాన్ బౌలింగ్(3.3)లో అబ్దుల్ సమద్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన పథుమ్ నిస్సంక కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ స్కోర్ 25 పరుగుల వద్ద ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో రిషభ్ పంత్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ని గోల్డెన్ డక్ గా ప్రిన్స్ యాదవ్ వెనక్కి పంపించాడు. 

దీంతో వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందు భారీ టార్గెట్ ఉంది. ఇప్పటి వరకు 8 ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో సమీర్ రిజ్వీ (11), ట్రిస్టన్ స్టబ్స్ (12*) ఉన్నారు. మరోవైపు లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీసుకోగా, మహ్మద్ షమీ, మోహ్సిన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టా