షో.. సూపర్.. ఎవియేషన్​ షో లో ఫ్లైట్లు, డ్రోన్ల విస్యానాలు

షో.. సూపర్.. ఎవియేషన్​ షో లో ఫ్లైట్లు, డ్రోన్ల విస్యానాలు
  • పిల్లల కేరింతలు.. పెద్దలు సెల్ఫీలతో సందడి
  • వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన  సందర్శకులు
  • బేగంపేట ఎయిర్​పోర్టులో ఎవియేషన్ షో నేడు లాస్ట్

హైదరాబాద్​, వెలుగు:  ఆకాశంలో విమానాలు, డ్రోన్ల విన్యాసాలు. వాటిని చూస్తూ.. పిల్లల కేరింతలు.. పెద్దలు చప్పట్లు .. సెల్ఫీలు దిగి జోష్ చేశారు. బేగంపేట ఎయిర్ ​పోర్టు ఏవియేషన్ ​షోలో భాగంగా శనివారం సందర్శకులతో సందడి నెలకొంది. వీకెండ్​ కాగా సిటీ నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి  ఫ్యామిలీస్ తో తరలివచ్చారు. సారంగ్ ​టీం ఎయిర్​ షో కు విజిటర్స్ ఫిదా అయ్యారు. పైలట్లు విన్యాసాలు చేస్తుండగా ఎయిర్​ పోర్టులో అరుపులు, కేకలు వేస్తూ సందడి చేశారు.  ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ బిజీగా గడిపారు. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన 130 స్టాళ్లలో ఎక్స్​ పోను తిలకించారు. జియాగూడకు చెందిన ఎయిర్ ​ఆర్క్ ​సంస్థ స్టాల్ లో  హ్యూమన్​  డ్రోన్​చూసేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపారు. డ్రోన్​ వివరాలను నిర్వాహకులు వివరించారు. హాల్​ఫ్యామిలీ వెల్ఫేర్ ​అసోషియేషన్​  స్టాల్​లో ఎరో టాయ్స్ ను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. ల్యాండ్ ​సర్వే చేసే డ్రోన్స్​, హైదరాబాద్​ ట్రాన్స్ పోర్ట్ కోసం ప్రత్యేకంగా స్కై క్యాబ్స్​ విజిటర్స్ ను ఆకట్టుకున్నాయి. ఫ్లైట్ల వద్దకు అనుమతి లేకపోగా బారికేడ్ల​ వెనకాల నుంచే చూశారు. షో ఆదివారంతో ముగుస్తుంది.

ఫ్లైట్ల నుంచి పైలట్లు డ్రెస్ ల దాకా..

మాది ఏపీ..బెంగళూరులో ఏరోస్పేస్​ ఇంజనీరింగ్​ చేస్తున్నా. షో చూసేందుకు ఇక్కడికి వచ్చా. నా స్టడీ ఏరోస్పేస్​ కావడంతో  కొత్త విషయాలు తెలుసుకున్నా.  ఫ్లైట్ల నుంచి పైలట్లు ధరించే డ్రెస్ ల దాకా ఉన్నాయి. ప్రతి ఒక్కదాని గురించి ఎక్స్​ప్లేయిన్ చేయడం బాగుంది.  

- శశిరేఖ, ఏరోనాటికల్ ​
ఇంజనీరింగ్ ​స్టూడెంట్​, బెంగళూరు

ఎక్స్​పీరియన్స్​ కూడా మస్ట్

పిల్లలకు అన్నిరకాల నాలెడ్జ్​ అవసరం. సైన్స్​అండ్​ టెక్నాలజీ ఎగ్జిబిషన్స్​ చాలా తక్కువ ఉంటాయి. టెక్స్ట్​ బుక్​ నాలెడ్జ్​ మాత్రమే సరిపోదు. ప్రాక్టికల్​ ఎక్స్​పీరియన్స్​ కూడా మస్ట్. ఎయిర్​ క్రాఫ్ట్స్​కు సంబంధించి ప్రతిది  డెప్త్​గా తెలుసుకోవచ్చు. ఇన్ స్పైర్ అయి స్టార్టప్స్​ను కూడా సొంతంగా చేయొచ్చు.

- వేద దీప్తి, ప్రైవేట్ ​ఎంప్లాయ్, హైదరాబాద్

లాస్ట్​ టైమ్ ​కంటే  బైటర్..

లాస్ట్ టైమ్​కంటే ఈసారి ఫ్లైట్లు షోలో పెట్టారు. స్టంట్స్​బాగున్నాయి.  బోయింగ్​– 777 ఎక్స్​ ఫ్లైట్ దేశంలోనే ఫస్ట్ టైమ్ ప్రదర్శిస్తున్నారు. బోయింగ్ ఎక్కాలని ఉంది.  ఆ ఫ్లైట్ దగ్గరకు వెళ్లనిచ్చినా బాగుండేది.

- భార్గవ్​, ఐటీ​ ఎంప్లాయ్, హైదరాబాద్​

ఫ్లైట్ ​సిమ్యులేటర్ బాగుంది

నేను 8 క్లాస్​ చదువుతున్నా. ఏవియేషన్​ షోకు ఫస్ట్​ టైమ్​ నాన్నతో వచ్చా. బోయింగ్​ ఫ్లైట్ బాగుంది. ఫ్లైట్ ​ సిమ్యులేటర్​ నచ్చింది. ఎయిర్​షో లో స్టంట్స్ ​కూడా బాగున్నాయి.
- అభినవ్, స్టూడెంట్,

హైదరాబాద్ ​పబ్లిక్​ స్కూల్, బేగంపేట