భారత జట్టుకు బిగ్ షాక్.. చీలమండ గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్.. రీప్లేస్‌మెంట్ ఎవరంటే?

భారత జట్టుకు బిగ్ షాక్.. చీలమండ గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్.. రీప్లేస్‌మెంట్ ఎవరంటే?

Shreyanka Patil Ruled Out: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. టీమిండియా స్టార్, ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) యాంకిల్ లిగమెంట్ (మడమ నరాల) గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమైంది. లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో బాల్‌ను ఛేజ్ చేయబోయి ఆమె మడమకి గాయం అయింది. తీవ్రమైన నొప్పితో గ్రౌండ్ లోనే అల్లాడిపోయిన శ్రేయాంకకు స్కాన్ చేయగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి తప్పుకుంది.  

శ్రేయాంక ప్లేస్‌లోకి ప్రేమా రావత్: 
శ్రేయాంక పాటిల్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రేమా రావత్ (Prema Rawat) కు సెలెక్టర్లు తొలిసారి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. నిజానికి శ్రేయాంకకు వరల్డ్ కప్‌ల ముందు గాయాలవ్వడం ఇది ఫస్ట్ టైమ్ కాదు.. గతంలో 2024 టీ20 వరల్డ్ కప్‌కు ముందు వేలి గాయం (Broken Finger) కారణంగా టోర్నీకి దూరం కాగా, ఆ తర్వాత మరో ఇంజూరీ వల్ల ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైంది. ఇప్పుడు మళ్లీ మెగా టోర్నీ మధ్యలోనే యాంకిల్ ఇంజూరీ అవ్వడం ఆమె కెరీర్‌కు పెద్ద మైనస్ అని చెప్పాలి.. భారత్ తరఫున 24 టీ20ల్లో 29 వికెట్లు తీసిన శ్రేయాంక.. పవర్‌ప్లేలో ఎకనామికల్‌గా బౌలింగ్ చేస్తూ హర్మన్‌ప్రీత్ సేనకు మెయిన్ వెపన్‌గా ఉండేది.

ప్లేయింగ్ XI లోకి రాధా యాదవ్?: 
శ్రేయాంక పాటిల్ దూరం కావడంతో రాబోయే మ్యాచ్‌ల్లో ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి సీనియర్ స్పిన్నర్ రాధా యాదవ్ (Radha Yadav) వచ్చే ఛాన్స్ ఉంది. రాధా యాదవ్ బౌలింగ్‌ పరంగా శ్రేయాంక కంటే కాస్త తక్కువగా రాణించిప్పటికీ, బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్‌లో మంచి హిట్టింగ్ చేయగలదు.. అన్నింటికీ మించి రాధా యాదవ్ టీమిండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్.. హాట్ స్పాట్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ కీలకమైన రన్స్ కాపాడటంలో ఆమె కీ రోల్ ప్లే చేస్తుంది. 

2025 వరల్డ్ కప్ సెంటిమెంట్ రిపీట్: 
శ్రేయాంక గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదొక రకంగా టీమిండియాకు తీవ్ర నష్టమని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2025 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా భారత్ ఇలాగే తమ కీ- ప్లేయర్ ప్రతీకా రావల్‌కు యాంకిల్ ఇంజూరీ వల్ల టోర్నీ మధ్యలో కోల్పోయింది. అప్పట్లో ఆమె ప్లేస్‌లోకి వచ్చిన షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన చేసి భారత్ తొలిసారి ఐసీసీ టైటిల్ గెలవడంలో మెయిన్ రోల్ ప్లే చేసింది.