మహిళను దూషించిన కేసులో శ్రీకాంత్ త్యాగి అరెస్టు

మహిళను దూషించిన కేసులో శ్రీకాంత్ త్యాగి అరెస్టు

ఇటీవల ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. గత 2,3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. విషయం అందరికీ తెలిసింది. అయితే ఆ వ్యక్తిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ త్యాగికి చెందిన ఓ అక్రమ  నిర్మాణంపై స్థానికులు ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే చెట్లను నాటడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళ పట్ల శ్రీకాంత్ త్యాగి దాడి చేశాడు. 

ఇప్పుడు అధికారులు కూడా రంగంలోకి దిగడంతో స్థానికులకు బలం చేకూరినట్టైంది. నోయిడాలోని సెక్టార్ 93 బి గ్రాండ్ ఓమాక్స్ సోసైటీలోని శ్రీకాంత్ త్యాగి అక్రమ నిర్మాణాన్ని అధికారులు ఇటీవలే బుల్డోజర్ తో తొలగించారు. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక మహిళపై దాడి చేసి పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి ఆచూకి తెలిపిన వారికి నోయిడా పోలీసులు ఇప్పటికే రూ.25,000  రివార్డు కూడా ప్రకటించారు. నిజానికి ఆ ఘటనలో శ్రీకాంత్ త్యాగిపై గ్యాంగ్‌స్టర్ చ‌ట్టం కింద కేసు నమోదు చేశారు.