న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత ఇండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్ అనంతరం రెస్ట్ తీసుకోకుండా తిరిగి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని డిసైడయ్యాడు.
రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్రతో గురువారం ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తను పంజాబ్ తరఫున ఆడనున్నాడు. కివీస్‌తో మూడో వన్డే ముగిసిన వెంటనే రాజ్‌కోట్ వెళ్లాడు. ఇండోర్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవడంతో గిల్ దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రయాణించి మరీ మ్యాచ్ కోసం రాజ్‌కోట్‌కు వెళ్లడం విశేషం. ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్ ఈ సమయాన్ని తన ఫామ్ మెరుగుపరుచుకోవడంతో పాటు టోర్నీలో పంజాబ్ టీమ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్ రంజీ ట్రోఫీ గ్రూప్–-బి పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
