గిల్ సూపర్ సెంచరీ..కోహ్లీ రికార్డు బ్రేక్

గిల్ సూపర్ సెంచరీ..కోహ్లీ రికార్డు బ్రేక్

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి టీ20లో  టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ శతకం బాదాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చివరి వరకు అజేయంగా నిలబడి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 63 బంతుల్లో 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 126 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో పలు రికార్డులను గిల్ బద్దలు కొట్టాడు. 

యంగెస్ట్ ఇండియన్..

మూడో టీ20లో న్యూజిలాండ్పై సెంచరీ చేసిన 23 ఏళ్ల గిల్..టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో అతి తక్కువ వయసులో ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా గిల్ నిలిచాడు. అలాగే టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్గానూ రికార్డు సృష్టించాడు. 

కోహ్లీ రికార్డు బద్దలు..

చివరి టీ20లో సెంచరీ చేయడం ద్వారా శుభ్ మన్ గిల్ ..విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. 2022లో ఆసియా కప్లో విరాట్ ఆఫ్ఘనిస్తాన్ పై 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే ఓ టీమిండియా బ్యాట్స్మన్  టీ20ల్లో చేసిన అత్యధిక పరుగుల రికార్డు. ప్రస్తుతం గిల్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.