
హైదరాబాద్ జీడిమెట్లలో లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి.. ఓ షాప్ ముందు కూర్చున్న ఎనిమిది మంది చిన్నారులు పోలీసులకు పట్టుబడ్డారు. చింతల్ భగత్ సింగ్ నగర్ లో విద్యార్థులను గమనించిన పోలీసులు..విద్యార్థులకు అవగాహన కల్పించారు. జీడిమెట్ల ఎస్ఐ సత్యం..విద్యార్థులకు లాక్ డౌన్ పై అవగాహన కల్పించి అక్కడి నుండి వారిని పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులకు లాక్ డౌన్ పై అవగాహన కల్పించిన పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు.