
సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు southindianbank.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు మే 26 ఆఖరు.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణ సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: మే 19.
- అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 26.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200.
- సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- శాలరీ: ఏడాదికి రూ.7.44 లక్షలు చెల్లిస్తారు.
ఆన్ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసిన వారిని మూడేండ్ల కాలానికి కాంట్రాక్ట్ బేస్డ్పైన ఉద్యోగంలోకి తీసుకుంటారు. మూడేండ్ల కాంట్రాక్టు కాలంలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్–1)గా పర్మినెంట్ ప్రాతిపదికన నియమిస్తారు.