వరల్డ్ జాలీ డే January 17 : అన్నింటిని పక్కన పెట్టి రిలాక్స్ అవ్వండి.. జాలీ డే ప్రత్యేకత ఇదే..!

వరల్డ్ జాలీ డే January 17 :  అన్నింటిని పక్కన పెట్టి రిలాక్స్ అవ్వండి..   జాలీ డే ప్రత్యేకత ఇదే..!

కొత్త సంవత్సరంలో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ తీర్మానాలు చేసుకునే వాళ్లు ఎందరో. వాళ్లలో కొంత మంది షరా మామూలుగా వాటిని లైట్ తీస్కుంటే.. సీరియస్ గా తీసుకుని పాటించేవాళ్లు ఇంకొందరు. ఆ పాటించేవాళ్లు ఒక్కరోజు రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆ వెసులుబాటు అందించేందుకే ఒకరోజు ఉంది. ఇప్పుడు ఆ రోజు గురించి తెలుసుకుందాం. . !

 జనవరి 17న 'డిచ్ న్యూ ఇయర్స్ రెజల్యూషన్ డే'. ఈ రోజు ఎలాంటి తీర్మానాలనైనా సరే పక్కనపడేసి జాలీగా గడపొచ్చు. తప్పు చేశామని బాధ పడాల్సిన అవసరం లేదు. నెదర్​లాండ్​ లో   జనవరి 17ను జాలీ డే గా   పాటించే సంప్రదాయం మొదలైంది. 

కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండు వారాలకే ఈ వెసులుబాటు ఉండటంతో ఊరట చెందే అవకాశం చాలా మందికి కలు గుతోంది. కానీ, ఆ తర్వాత ఏడాది పొడవునా తీర్మానాలను తప్పక పాటించాల్సి ఉంటుంది కదా! అందుకే అమెరికా, చైనా, నైజీరియా లాంటి దేశాలు మధ్య మధ్యలో కూడా 'డిచ్  ఇయర్ రెజల్యూషన్ డే'లు జరుపుతున్నాయి. ​ కొన్ని సర్వేల  ప్రకారం ఈ ఏడాదిలో 80 శాతం మంది ఈ రోజును జరుపుకునే  అవకాశాలు ఉన్నట్లు ఓ అంచనా.