వైరల్ వీడియో: పామును పట్టుకున్న హీరో.. యానిమల్ బోర్డు ఫిర్యాదు

వైరల్ వీడియో: పామును పట్టుకున్న హీరో.. యానిమల్ బోర్డు ఫిర్యాదు

చెన్నై: ప్రముఖ తమిళ హీరో శింబు వివాదంలో చిక్కుకున్నాడు. ఈశ్వరన్ సినిమా షూటింగ్‌‌లో పాల్గొన్న శింబు.. మూవీ సెట్స్‌‌లో కోబ్రా స్నేక్‌‌ను పట్టుకొన్నాడు. చెట్టుపై వేలాడుతున్న పామును బాల శరవణన్‌‌తోపాటు మరో వ్యక్తి సాయంతో శింబు పట్టుకొని గోనె సంచిలో వేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్‌‌లో హల్‌‌చల్ చేస్తోంది. ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నైకి చెందిన ఓ యానిమల్ యాక్టివిస్ట్.. శింబుపై ఫిర్యాదు చేశారు. శింబుతోపాటు ఈశ్వరన్ సినీ యూనిట్‌‌పై కంప్లయింట్ ఇచ్చారు. ఇదే విషయంపై యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూ‌‌బీఐ) కూడా ఈశ్వరన్ యూనిట్‌ మీద ఫిర్యాదు చేసింది. వైల్డ్‌‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సినిమాల్లో పాములను ప్రదర్శించకూడదు. ఒకవేళ నేరం నిరూపితమైతే శింబుతోపాటు ఈశ్వరన్ మూవీ యూనిట్‌‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.