ఆర్కిటిక్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సింధు.. BWF‌‌‌ సర్క్యూట్‌‌‌‌పై భారత షట్లర్ల ఫోకస్

ఆర్కిటిక్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సింధు.. BWF‌‌‌ సర్క్యూట్‌‌‌‌పై భారత షట్లర్ల ఫోకస్

వాంటా (ఫిన్లాండ్‌‌‌‌): ఆసియా క్రీడల్లో నిరాశపర్చిన ఇండియా షట్లర్లు ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌పై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే ఆర్కిటిక్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. రెండుసార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధు తొలి రౌండ్‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌తో తలపడనుంది. ఈ ఏడాది జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ విజేతగా నిలిచిన సింధు మంచి ఫామ్‌‌‌‌లో ఉంది. 

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌‌‌.. బ్రియాన్‌‌‌‌ యంగ్‌‌‌‌ (కెనడా)ను ఎదుర్కోనున్నాడు. హెచ్‌‌‌‌.ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌.. నాలుగోసీడ్‌‌‌‌ అండర్స్‌‌‌‌ ఆంటోన్‌‌‌‌సెన్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌)తో తలపడతాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో తన్వీ శర్మ, ఇషానీ బారువా, అస్మితా చాలిహా, ఉన్నతి హుడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.