జకర్తా: ఇండియా టాప్ షట్లర్ పీవీ సింధు.. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్ సింధు 21–19, 21–18తో లైన్ హోజ్‌మార్క్ కెర్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై గెలిచింది.
ఫలితంగా ముఖాముఖి రికార్డును 5–1కి పెంచుకుంది. మరో మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్ 21–16, 14–21, 11–21తో నొజోమి ఒకుహర (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–10, 21–11తో జాసన్ గన్‌వాన్ (హాంకాంగ్)పై గెలవగా, కిడాంబి శ్రీకాంత్ 11–21, 10–21తో చౌ టైన్ చెన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడిపోయాడు.
