స్టార్ షట్లర్ PV సింధు రెండు నెలల ఆటకు దూరం.. ఎందుకంటే..?

స్టార్ షట్లర్ PV సింధు రెండు నెలల ఆటకు దూరం.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు రెండు నెలల పాటు ఆటకు దూరం అవుతోంది. ఈ ఏడాది మిగిలిన అన్ని  బీడబ్ల్యూఎఫ్​టూర్ టోర్నమెంట్ల నుంచి వైదొలగాలని డిసైడైంది. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. 

గాయం నుంచి కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం ముఖ్యమని తన సపోర్ట్ టీమ్, ప్రముఖ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ దిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా పర్దివాలాతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు 30 ఏండ్ల హైదరాబాదీ తెలిపింది. ‘నా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చించి, డాక్టర్ పర్దివాలా సలహా మేరకు 2025లో మిగిలిన బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్ ఈవెంట్ల నుంచి విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా అవ్వడం బెస్ట్ అనిపించింది. నా కాలి గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదు’ అని ప్రకటించింది. 

============================================================