జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌తోనే సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో ఐదో సీడ్ సింధు 13–21, 17–21తో టాప్‌సీడ్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో ఓడింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ లక్ష్యసేన్ 18–21, 20–22తో పనిట్చాఫోన్ తీరరత్సకుల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. చివరి వరకు పోరాడిన లక్ష్య కీలక టైమ్‌లో పాయింట్లు రాబట్టడంలో అతను విఫలమయ్యాడు.
