Sing Geetham: ఇన్‌స్టాగ్రామ్ నుంచి సినిమాలో ఛాన్స్.. ‘సింగ్ గీతం’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ జర్నీ వైరల్

Sing Geetham: ఇన్‌స్టాగ్రామ్ నుంచి సినిమాలో ఛాన్స్.. ‘సింగ్ గీతం’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ జర్నీ వైరల్

సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు నుంచి వస్తోన్న చిత్రం ‘సింగ్‌‌‌‌‌‌‌‌ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్‌‌‌‌‌‌‌‌పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలకపాత్రలు పోషించారు. ఈనెల 11న సినిమా విడుదల సందర్భంగా అహల్యా బమ్రూ మాట్లాడుతూ ‘మాది పుదుచ్చేరి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాలీ భాషలు మాట్లాడే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగా.

ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో నా కంటెంట్ చూసి నాగ్ అశ్విన్ గారు ఇందులో పాత్ర ఇచ్చారు. నా ఆడిషన్‌ కూడా ఇన్‌స్టాలోనే ఇచ్చా. అంతకుముందు కూడా నటిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశమే ‘సింగ్‌ గీతం’. నాకు పాటలు పాడటం, గిటార్‌ వాయించడం అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే సంగీతం ప్రధానంగా సాగే కథే కావడంతో ‘సింగ్‌ గీతం’ మరింత ఇష్టంగా చేశా.

ఇండియన్ లెజండరీ సింగీతం గారి దర్శకత్వంలో పని చేయడం నా అదృష్టం. ఇండియన్‌‌‌‌‌‌‌‌ సినిమా హిస్టరీలోనే కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ మూవీ ఇది. షూట్‌‌‌‌‌‌‌‌కు ముందే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు నేర్చుకోవడం కొంత హెల్ప్ అయింది.

ఇందులో నాది చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న యూనిక్ క్యారెక్టర్. ఈ కథ యూనివర్సల్‌‌‌‌‌‌‌‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. దేవిశ్రీ గారు చాలా ప్రత్యేకమైన సంగీతాన్ని అందించారు. నాకు యాక్షన్ సినిమాలు  ఇష్టం. భవిష్యత్తులో అలాంటివి చేయాలి అనుకుంటున్నా. తెలుగులో మహేష్ బాబు గారు ఇష్టం.  ఇది నాకు రెండో సినిమా. గతంలో అభిషేక్ బచ్చన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఓ సినిమా చేశా.  ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నా’ అని చెప్పారు.