100 కేజీల బాంబు.. సిటీ నడిబొడ్డున దొరికింది.

100 కేజీల బాంబు.. సిటీ నడిబొడ్డున దొరికింది.

నగరం నడిబొడ్డున దొరికిన 100 కిలోల బాంబును అధికారులు సురక్షితంగా పేల్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఏరియల్ బాంబును జనాలు లేని ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా పేల్చారు. ఈ ఘటన సింగపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సింగపూర్ లోని కండోమినియం ఎస్టేట్ మెట్రో స్టేషన్ సమీపంలో రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన 100 కిలోల బాంబును స్థానిక పోలీసులు గుర్తించారు. దీంతో ఈ బాంబును పేల్చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం ఏర్పాట్లు చేశారు. సింగపూర్ లోని  అప్పర్ బుకిట్ తిమాహ్ ప్రాంతంలో బాంబునే పేల్చేందుకు ఏర్పాట్లు చేశారు .అయితే  చుట్టు ప్రక్కల అపార్ట్ మెంట్లు, ఇండ్లలో ఉండేవారిని ఖాళీ చేయించారు. అలాగే ఇండ్ల కిటికీలు తెరి ఉంచిపెట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయాలన్నారు. అధికారుల సూచనల మేరకు ఇండ్ల కిటికీలు తెరిచి, విద్యుత్ కనెక్షన్ ను ఆపేశారు .అనంతరం ఇండ్లను ఖాళీ చేశారు. పకడ్బందీ చర్యల అనంతరం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఒకసారి, మధ్యాహ్నం 1.45 గంటలకు మరోసారి బాంబును పేల్చారు.

ఎలా పేల్చారంటే..

సింగపూర్ లోని  అప్పర్ బుకిట్ తిమాహ్ ప్రాంతంలో ఓ భారీ గొయ్యిని తవ్వారు. గొయ్యిలో బాంబును పెట్టారు.  గొయ్యి చుట్టూ భారీ సిమెంట్ ఇటుకలను అడ్డుగా పెట్టారు. గొయ్యిపై భారీ చెక్కలను అడ్డుగా పెట్టారు.  వాటిపై వుడ్ చెక్కలను పేర్చారు.  అనంతరం ఆ ఉడ్ చెక్కలపై రేకుతను అమర్చారు. వాటిపై  వందల సంఖ్యలో ఇసుక నింపిన సంచులను పెట్టారు. అనంతరం బాంబును పేల్చారు. 

బాంబు పేలిన నేపథ్యంలో దీని వల్ల చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఏమైన నష్టం వాటిల్లిందా అనే కోణంలో పరిశీలించనున్నారు. అపార్ట్ మెంట్లు, రోడ్లు, కాల్వలు, పైప్ లైన్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించనుంది సింగపూర్ పోలీస్ ఫోర్స్.