కొత్త స్ట్రెయిన్ తో సింగపూర్ లో పిల్లలకు సోకుతున్న కరోనా

కొత్త స్ట్రెయిన్ తో సింగపూర్ లో పిల్లలకు సోకుతున్న కరోనా

కరోనా వైరస్ బారిన వారిలో ఇప్పటి వరకు పెద్దలతో చూసుకుంటే.. పిల్లల సంఖ్య చాలా తక్కువ.ఇప్పుడు పిల్లలకు కూడా కరోనా సోకుతోంది. లేటెస్టుగా సింగపూర్ లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా చిన్నపిల్లలున్నారు. దీనికి కారణం సింగపూర్ లో బయటపడిన భారత్ స్ట్రెయిన్ B.1.617 తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కొత్త స్ట్రెయిన్ తో చిన్నారులు అత్యధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.దీంతో బుధవారం నుంచి సింగపూర్ లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మే 28తో అకాడమిక్ ఇయర్ పూర్తి కానుండగా, అప్పటివరకు ఆన్ లైన్ లో క్లాసులు కొనసాగుతాయని అధికారవర్గాలు ప్రకటించాయి. 

కొన్నినెలలుగా సింగపూర్ లో కొత్త కేసులు నమోదు కాలేదు. అలాంటి పరిస్థితి నుంచి .. మళ్లీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఇక్కడి అధికార వర్గాలను కలవరపెడుతోంది.ఈ క్రమంలో..కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.