గోదావరిఖనిలోని సింగరేణి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త్వరలో క్యాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాబ్: సీఎంఏ డాక్టర్ కిరణ్‌‌‌‌‌

 గోదావరిఖనిలోని  సింగరేణి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త్వరలో క్యాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాబ్: సీఎంఏ డాక్టర్ కిరణ్‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుండె వ్యాధుల కోసం త్వరలో క్యాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాబ్​ ప్రారంభించనున్నట్లు సింగరేణి చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్​ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(కొత్తగూడెం కార్పొరేట్) కిరణ్​రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​ తెలిపారు. సోమవారం గోదావరిఖని జీఎం ఆఫీసులో జీఎం డి.లలిత్​ కుమార్, ఇతర ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్న నేపథ్యంలో సీఎండీ బలరామ్​ ఆదేశాల మేరకు గోదావరిఖని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాథ్​ల్యాబ్​ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నెలకొల్పుతున్నామన్నారు. రెండు, మూడు నెలల్లో ఈ సర్వీస్​ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డాక్టర్లు, స్టాఫ్​ కొరతపై చర్చించారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సివిల్ డీజీఎం వరప్రసాద్, వీరారెడ్డి, జీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజు, మోహన్ రావు, బ్రహ్మాజీ, సాంబశివరావు పాల్గొన్నారు.