50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తాం

50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తాం

కోల్​బెల్ట్​,వెలుగు:  సింగరేణి కంపెనీకి ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్​ స్టేజ్- 1, స్టేజ్ -2  పర్మిషన్లు వచ్చాయని, గని ప్రాంతంలోని చెట్లు లెక్కింపు, తొలగింపు పనులను అటవీశాఖ త్వరగా పూర్తి చేసి స్థలాన్ని అప్పగించాలని సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్​ కోరారు. గనిలో బొగ్గు ఉత్పత్తి  రవాణాకు అవసరమైన అన్ని  ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని,  ఈ ఏడాది కనీసం 50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నట్లు  చెప్పారు. శుక్రవారం  ఒడిశా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్​లో కేంద్ర బొగ్గు మంతిత్వశాఖ సెక్రటరీ అమృతలాల్​ మీనా ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా,  సంబంధిత అధికారులు,   కొత్త బొగ్గు గనుల యజమానులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సింగరేణి కపంపెనీ తరుపున  సీఎండీ ఎన్​.శ్రీధర్,​ డైరెక్టర్ (ఫైనాన్స్, పా)  ఎన్. బలరామ్ పాల్గొన్నట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది.  ఒడిశాలో సింగరేణి నైనీ తో పాటు అన్ని కొత్త గనులకు పూర్తి సహకారం అందించాలని కేంద్ర బొగ్గు మంతిత్వశాఖ సెక్రటరీ అమృతలాల్​ మీనా ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా,  సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు యాజమాన్యం తెలిపింది.  దేశ బొఈఈగ్గు అవసరాలను తీర్చడం కోసం కొత్త గనులను తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారని,  దేశంలో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా కొత్త గనుల నుంచి సకాలంలో బొగ్గు ఉత్పత్తి జరిగి తీరాలని కేంద్ర సెక్రటరీ సమావేశంలో ఆదేశాలు జారీ చేసినట్లు సింగరేణి పేర్కొంది. సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్​కు  అన్ని అనుమతులు లభించి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పర్యావరణ అటవీ శాఖ నుంచి పూర్తి సహకారం అందించి అతి త్వరలో బొగ్గు ఉత్పత్తి  ప్రారంభించేందుకు  సహకరించాలని  ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, సంబంధిత ఉన్నతాధికారులకు సూచించడంతో ఆఫీసర్లు సానుకూలంగా స్పందించారని తెలిపింది. సమావేశంలో  కోలిండియా చైర్మన్​ ప్రమోద్​ అగర్వాల్​తో పాటు ఒడిశా లో  కొత్తగా గనులు చేపడుతున్న మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, నార్తర్న్​ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్​, డైరెక్టర్​(ఫైనాన్స్​, పర్సనల్​) ఎన్​.బలరామ్​, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే ఇతర కొత్త బ్లాకుల కంపెనీల పాల్గొన్నాయి. 

రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ…

ఒడిశా పర్యటనలో భాగంగా సింగరేణి సీఎండీ, డైరెక్టర్​  ఒడిశా రాష్ట్ర సీఎం సెక్రటరీలు వినీల్​ కృష్ణ, కుట్టిలతో సమావేశమాయ్యరు. ఈ సందర్భంగా  నైనీ బొగ్గు బ్లాక్​కు సంబంధించిన సహకారాన్ని అందించాలని సంబంధితా జిల్లా కలెక్టర్​, అటవీశాఖ ఆఫీసర్లకు సీఎం సెక్రటరీలు  ఆదేశాలు జారీ చేశారని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. అనంతరం  నైనీ బ్లాక్​ జీఎంటి.శ్రీనివాస్​రావు, డీజీఎం సుజయ్​ మంజుందార్​, ఎస్​ఈ ప్రవీన్​ కాశ్యప్​తో సీఎండీ, డైరెక్టర్​  సమీక్ష జరిపారు.