సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలని   ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టి వేసింది హైకోర్టు. దీంతో  డిసెంబర్  27 న యధావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. 

షెడ్యూల్ ప్రకారం సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27న జరగాల్సి ఉంది.  అయితే  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని కోరుతూ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, అడ్మినిస్ర్టేటివ్, శాంతిభద్రతల పరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ సర్కార్  హైకోర్టులో పిటిషన్ వేసింది. 

 ప్రభుత్వం వేసిన పిటిషన్ ను డిసెంబర్ 18న  విచారించిన హైకోర్టు ..తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. ఇవాళ విచారించిన హైకోర్టు ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 27న యథావిధంగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి.