త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డు పునరుద్ధరణ.. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం..

త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డు పునరుద్ధరణ.. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం..

గోదావరిఖని, వెలుగు: గతంలో లాగే సింగరేణి మెడికల్ బోర్డును నిర్వహించేందుకు మేనేజ్‌‌మెంట్ హామీ ఇచ్చిందని ఐఎన్‌‌టీయూసీ సెక్రటరీ జనరల్, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్ తెలిపారు. సింగరేణి కార్మికుల్లో నెలకొన్న సమస్యలపై ఐఎన్‌‌టీయూసీ ప్రతినిధి బృందం హైదరాబాద్‌‌లో మంత్రులు శ్రీధర్‌‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని కలిశారు. 

వారి సూచన మేరకు సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్​జ్యోతి, డైరెక్టర్(పా) గౌతమ్ పోట్రును కలిసి వినతిపత్రం అందజేశారు. మెడికల్ బోర్డు నిర్వహణ కొనసాగింపు, గత రెండు బోర్డులపై రివ్యూ, కార్మికుల పెర్క్స్‌‌పై విధిస్తున్న ఇన్‌‌కమ్ ట్యాక్స్ రద్దు, సొంతింటి పథకం అమలు, ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు, మారుపేర్ల మార్పు, డిస్మిస్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రస్తావించారు.

 వీటిపై సీఎండీ సానుకూలంగా స్పందించి మెడికల్ బోర్డు పునరుద్ధరణకు, రెండు బోర్డులపై రివ్యూ నిర్వహించేందుకు హామీ ఇచ్చారని జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌‌టీయూసీ నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, దాస్, కోట రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.