సింగరేణి వీఎర్ఎస్ బాధితులను ఆదుకోవాలి

సింగరేణి వీఎర్ఎస్ బాధితులను ఆదుకోవాలి

న్యూఢిల్లీ: అధికారుల ఒత్తిడితో వీఎర్ఎస్ తీసుకున్న సింగరేణి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం వివేక్ వెంకట స్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.  ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... తమ వారసుకులకు ఉద్యోగం ఇస్తామని సింగరేణి అధికారులు హామీ ఇవ్వడంతో 1997-2001 మధ్య కాలంలో 1795 మంది కార్మికులు వీఆర్ఎస్ తీసుకున్నారని అన్నారు.  ఇందుకు సంబంధించి 1998 లో కార్మిక యూనియన్ తో  సింగరేణి యాజమాన్యం ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని, నెలకు 30 మంది చొప్పున రెండేళ్ల లో  బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని అగ్రిమెంట్ లో తెలిపిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లానని, కానీ ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కొత్త ఉద్యోగులను తీసుకుంటున్న నేపథ్యంలో వీఆర్ఎస్ తీసుకున్న కుటుంబాలకు న్యాయం చేయాలని మంత్రిని కోరినట్లు వివేక్ చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. 

ఇవి కూడా చదవండి...

రెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

ఐటీ రిటర్న్‌‌ను ఎలా ఫైల్ చేయాలంటే..