సింగరేణి టెండర్లలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గోల్‌‌‌‌మాల్‌‌‌‌..అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం

సింగరేణి టెండర్లలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గోల్‌‌‌‌మాల్‌‌‌‌..అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం
  • టీపీసీసీ చీఫ్​మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌

నిజామాబాద్, వెలుగు : ‘పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో సింగరేణి టెండర్లలో అవినీతికి పాల్పడి సంస్థ సొమ్ము ఎలా లూటీ చేశారో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం.. కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌రావు చర్చకు రావాలి’ అని టీపీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌‌‌ సవాల్‌‌‌‌ చేశారు. నిజామాబాద్‌‌‌‌ డీసీసీ ఆఫీస్‌‌‌‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. 

పదేండ్ల పాలనలో ఆర్థికంగా లాభం లేకుండా ఏ పనీ చేయలేదని, ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు తీసుకున్నారని, కాళేశ్వరం అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడ్డారని అని ఆరోపించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో జరిగిన లోపాలను సెట్‌‌‌‌ చేసి పారదర్శక విధానాలను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో సింగరేణికి జరిగిన నష్టం, కాంగ్రెస్‌‌‌‌ హయాంలో వచ్చిన ఆదాయంపై చర్చకు రావాలని, బురద జల్లి పారిపోతామంటే కుదరన్నారు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పెద్దలందరి పాత్ర ఉందని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, సినీతారల ఫోన్లు కూడా ట్యాప్‌‌‌‌ చేశారని ఆరోపించారు. 

బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేయడం తప్ప దేశానికి, రాష్ట్రానికి బీజేపీ చేసిన మేలు ఏమీ లేదన్నారు. రాముడి పేరు లేకుండా మున్సిపల్‌‌‌‌ ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని సవాల్‌‌‌‌ చేశారు. ఎంపీ అర్వింద్‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

అర్వింద్​రాజకీయం ఎక్కడ మొదలైందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఆయన పదవి కాంగ్రెస్‌‌‌‌ పెట్టిన భిక్ష అన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్‌‌‌‌ తాహెర్, డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ నగేశ్‌‌‌‌రెడ్డి, అగ్రికల్చర్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సభ్యుడు గంగాధర్‌‌‌‌ ఉన్నారు.