"జై బాలయ్య" నోయల్ పవర్ ఫుల్ పాట.. మీరు విన్నారా?

"జై బాలయ్య" నోయల్ పవర్ ఫుల్ పాట.. మీరు విన్నారా?

నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు రాప్ సింగర్ నోయల్(Noyal). జూన్ 10 బాలకృష్ణ(Balakrishna) పుట్టినరోజు సందర్భంగా నోయల్ ఓక్ రాప్ సాంగ్ ను రిలీజ్ చేశాడు. బాలయ్య గొప్ప మనసును చాటుతూ సాగిన ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేశాడు. నోయల్ స్వయం గా రాసి పాడిన ఈ పాటకు.. ప్రదీప్ సంగీతం అందించాడు.. “నందమూరి సింహం వచ్చే సూడు.. " అంటూ పవర్ ఫుల్ లిరిక్స్ తో సాగిన ఈ పాట ఆడియన్స్ ను మరీ ముఖ్యంగా బాలయ్య అభిమానులను బాగా ఆకట్టుకుంటుంటుంది. 

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో "భగవంత్ కేసరి(Bhavanth Kesari)" అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 10న అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.