గన్ పార్క్ లో బహుజన బతుకమ్మ నిర్వహిస్తాం

గన్ పార్క్ లో బహుజన బతుకమ్మ నిర్వహిస్తాం

హైదరాబాద్: కుల నిర్మూలనే లక్ష్యంగా ఈసారి బహుజన బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రజాగాయకురాలు విమలక్క స్పష్టం చేశారు. బతుకమ్మ అంటే ఉత్సవం కాదని.. ఉద్యమమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 24న గన్ పార్క్ లో ఉత్సవాలను ప్రారంభించి అక్టోబర్ 4 వరకు నిర్వహిస్తామని తెలిపారు.

బతుకమ్మ పాటలు పాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. బహుజనుల సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. ఈ ఉత్సవానికి మహిళలు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని విమలక్క పిలుపునిచ్చారు.