యాభై కోర్సులకు ఒకే ఎగ్జామ్

యాభై కోర్సులకు ఒకే ఎగ్జామ్

సోషల్ వర్క్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, తదితర కోర్సులకు దేశంలోనే టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ ముంబయి, తుల్జాపూర్, హైదరాబాద్, గువహటి క్యాంపసుల్లో 50 పీజీ కోర్సులు అందిస్తోంది. వచ్చే అకడమిక్ ఇయర్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం

టాటా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సోషల్​ సైన్సెస్​ ముంబయి క్యాంపస్​లో 32, హైదరాబాద్​లో 6, తుల్జాపూర్​లో 4, గువహటిలో 8 పీజీ కోర్సులు నిర్వహిస్తోంది. అన్ని కోర్సులకు స్టేజ్​1 ఎగ్జామ్​ ఉమ్మడిగానే ఉంటుంది. ఈ కోర్సులకు సాధారణ డిగ్రీ విద్యార్హతతో పోటీ పడే అవకాశం కల్పించారు. కొన్ని కోర్సులకు మాత్రం సంబంధిత విభాగంలో యూజీ పూర్తిచేసినవారే అర్హులు. అభ్యర్థులు చేరిన కోర్సులను బట్టి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంహెచ్​ఏ, ఎంపీహెచ్​ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ప్రతి అభ్యర్థి గరిష్టంగా మూడు  ప్రోగ్రామ్స్​కు​ అప్లై చేసుకోవచ్చు.

విభాగాలు:-1) బీఏ(ఆన‌‌ర్స్‌‌) సోష‌‌ల్ వ‌‌ర్క్‌‌,

2) బీఏ ఇన్ సోషల్ సైన్సెస్, 3) మాస్టర్స్ ప్రోగ్రామ్స్​ (ఎంఏ/ ఎమ్మెస్సీ);

సెలక్షన్​ చేస్తారిలా..: ఏ కోర్సు సెలెక్ట్​ చేసుకున్నా టిస్​, నెట్​ రాయాలి. ఈ ఎగ్జామ్స్​లో వచ్చిన మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి స్టేజ్​2  ఎగ్జామ్​నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు ప్రోగ్రామింగ్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ (పీఏటీ), వంద మార్కులకు ఆన్​లైన్​ పర్సనల్​ ఇంటర్వ్యూ (ఓపీఐ) ఉంటాయి. తుది ఎంపికలో టిస్​‌‌‌‌-నెట్​కు 30, పీఏటీకి 40, ఓపీఐకి 30 శాతం వెయిటేజీ ఉంటుంది. హ్యూమన్​ రిసోర్స్​ మేనేజ్​మెంట్​ అండ్​ లేబర్​ రిలేషన్స్​, ఆర్గనైజేషన్​ డెవలప్​మెంట్​ చేంజ్​ అండ్​ లీడర్​షిప్​.. ఈ రెండు కోర్సులకు అప్లై చేసుకున్నవారు పీఏటీ బదులు టిస్​ మ్యాట్​ రాయాలి. టిస్​ నెట్​పరీక్షను ఆన్​లైన్​లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్​ ప్రశ్నలు వస్తాయి. జనరల్​ అవేర్​నెస్​ 40, ఇంగ్లిష్​ ప్రొఫిషియన్సీ 30, మ్యాథ్స్​ అండ్​ లాజికల్​ రీజనింగ్​ 30 మార్కులకు ఉంటాయి.

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తులు: ఆన్​లైన్​

చివరితేది: 15 జనవరి 2021

పరీక్ష తేది: 20 ఫిబ్రవరి 2021

ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్, విశాఖపట్నం

వెబ్​సైట్​: www.admissions.tiss.edu