సింగూరు ప్రాజెక్ట్‌‎ను పర్యాట‌‌‌‌క కేంద్రంగా మారుస్తాం: మంత్రి దామోద‌‌‌ర రాజ‌‌‌‌న‌‌‌‌ర్సింహ

సింగూరు ప్రాజెక్ట్‌‎ను పర్యాట‌‌‌‌క కేంద్రంగా మారుస్తాం: మంత్రి దామోద‌‌‌ర రాజ‌‌‌‌న‌‌‌‌ర్సింహ

రాయికోడ్, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్‌‌‌‌ పరిసర ప్రాంతాలను ప‌‌‌‌ర్యాట‌‌‌‌క కేంద్రాలుగా మారుస్తామని మంత్రి దామోద‌‌‌‌ర రాజ‌‌‌‌న‌‌‌‌ర్సింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌‌‌‌ మండ‌‌‌‌ల ప‌‌‌‌రిధిలోని ఇందూర్ గ్రామ స‌‌‌‌మీపంలో గ‌‌‌‌ల సింగూరు బ్యాక్‌‌‌‌వాటర్‌‌‌‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌‌‌కు 100 కిలోమీటర్ల లోపు ఉన్న సింగూరు ప్రాజెక్ట్‌‌‌‌ను టూరిజం హబ్‌‌‌‌గా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

 సింగూరు బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ స‌‌‌‌మీప‌‌‌‌ గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌ సంస్థ ఆధ్వర్యంలో రిసార్ట్స్‌‌‌‌ నిర్మించనున్నట్లు చెప్పారు. అనంతరం మునిప‌‌‌‌ల్లి మండ‌‌‌‌లం బుదేరా  నుంచి రాయికోడ్​ మండలం సిరూరు వ‌‌‌‌ర‌‌‌‌కు జ‌‌‌‌రుగుతున్న రోడ్డు ప‌‌‌‌నులను, బొగ్గులంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ అలుగుపై నిర్మిస్తున్న హైలెవ‌‌‌‌ల్‌‌‌‌ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ రోడ్డు పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖ‌‌‌‌లు మారిపోతాయని చెప్పారు. 

అంత‌‌‌‌కుముందు  ఇందూరు శివారులోని అక్కమహాదేవి ఆశ్రమ పీఠాధిప‌‌‌‌తి చెన్న మ‌‌‌‌ల్లికార్జున స్వామి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. మంత్రి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగ‌‌‌‌మేశ్వర్‌‌‌‌ పాటిల్‌‌‌‌, జిల్లా గ్రంథాల‌‌‌‌య సంస్థ చైర్మన్‌‌‌‌ అంజ‌‌‌‌య్య, డీసీఎంఎస్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌ సిదన్న పాటిల్‌‌‌‌, మాజీ జ‌‌‌‌డ్పీటీసీలు మ‌‌‌‌ల్లికార్జున్‌‌‌‌ పాటిల్‌‌‌‌, ఆల‌‌‌‌య క‌‌‌‌మిటీ చైర్మన్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌రావు, ఏఎంసీ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ విన‌‌‌‌య్, మండ‌‌‌‌ల అధ్యక్షుడు బాలాజీ న‌‌‌‌ర్సింలు ఉన్నారు.