హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్–-2026 వెరిఫికేషన్ ప్రక్రియను స్పీడప్చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్‌ను సందర్శించిన ఆయన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జీహెచ్‌ఎంసీ అడిషనల్కమిషనర్ (ఎన్నికలు) సంతోష్, డిప్యూటీ ఎలక్షన్ఆఫీసర్, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, అడిషనల్కలెక్టర్(స్థానిక సంస్థలు) జితేందర్ రెడ్డితో కలిసి ఈసీఐనెట్ లాగిన్ ద్వారా జరుగుతున్న ఎస్‌ఐఆర్ వెరిఫికేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.
విచారణ తర్వాత పత్రాలు బీఎల్‌ఓ నుంచి ఏఈఆర్‌ఓ, ఈఆర్‌వోల ద్వారా డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి లాగిన్‌కు చేరుతున్నాయని ఆఫీసర్లు వివరించారు. సెప్టెంబర్ 8న రెండు లాగిన్‌లతో ప్రారంభమైన వెరిఫికేషన్ ప్రక్రియ 16 లాగిన్‌లకు పెరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 45 వేలకుపైగా వెరిఫికేషన్లు పూర్తయ్యాయని, సెప్టెంబర్ 17న ఒక్కరోజే సుమారు 16 వేల వెరిఫికేషన్లు చేసినట్లు వివరించారు. ఏవో వెంకట్రామిరెడ్డి, ఎన్నికల అబ్జర్వర్రహీం, ఎన్‌ఐసీ డీఐవో మధుసూదన్ పాల్గొన్నారు.
