హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో రెండో రోజు అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ఇంటెన్సివ్రివిజన్(ఎస్ఐఆర్) కొనసాగింది. మొదటి రోజు ఫామ్స్ లేక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ శుక్రవారం అన్ని నియోజకవర్గాలకు వచ్చాయి. రెండు రోజుల్లో కలిపి 4 శాతం ఫామ్స్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా, 1.50 లక్షల మందికి ఫామ్స్ అందించినట్లు పేర్కొన్నారు. ఇకపై ఎస్ఐఆర్ స్పీడ్అవుతుందని, ఆదివారం కూడా బీఎల్ వోలు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారని తెలిపారు. వచ్చే నెల 2 వరకు ఫామ్స్ పంపిణీ పూర్తవుతుందని, ఆ తర్వాత వాటిని కలెక్ట్ చేయనున్నట్లు చెప్పారు.
