హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. వినాయక నిమజ్జనానికి స్పెషల్ MMTS రైళ్లు... రూట్లు, టైమింగ్స్ ఇవే..!

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. వినాయక నిమజ్జనానికి స్పెషల్ MMTS రైళ్లు... రూట్లు, టైమింగ్స్ ఇవే..!

హైదరాబాద్ పబ్లిక్ కు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే సంస్థ. గణేష్ నిమజ్జనం సందర్భంగా స్పెషల్ MMTS రైలీ నడపనున్నట్లు ప్రకటించింది. నిమజ్జనం సందర్భంగా ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 25 నుండి 27వ తేదీ వరకు ఈ స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.

సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, ఫలక్ నుమాలను కలిపే కీలక మార్గాల్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని తెలిపారు అధికారులు. అర్థరాత్రి నిమజ్జన ఉత్సవాల సమయంలో ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి అదనపు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు.

ఈ సర్వీసులలో రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుండి హైదరాబాద్, 12.30 గంటలకు హైదరాబాద్ నుండి లింగంపల్లి, 1.50 గంటలకు లింగంపల్లి నుండి హైదరాబాద్ రైలు ఉన్నాయని... తెల్లవారుజామున 3.30 గంటలకు హైదరాబాద్-సికింద్రాబాద్ రైలు బయలుదేరుతుందని తెలిపారు.

హైదరాబాద్-లింగంపల్లి ప్రత్యేక రైలు రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుందని... ఆ తర్వాత లింగంపల్లి నుండి ఫలక్‌నుమాకు రాత్రి 12.10 గంటలకు, ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్‌ కు తెల్లవారుజామున 2.20 గంటలకు సర్వీసులు ఉంటాయని తెలిపారు అధికారులు. సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ మధ్య మరో సర్వీసు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు అధికారులు.

ఈ స్పెషల్ MMTS రైళ్లు ఆయా రూట్లలో అన్ని స్టేషన్లలో ఆగుతాయని, ప్రయాణికులు అన్ని సాధారణ స్టాప్‌ లలో ఎక్కడానికి, దిగడానికి వీలు కల్పిస్తాయని తెలిపారు రైల్వే అధికారులు.