తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా ఆహారం అందించి స్వరాష్ట్ర సాధనలో తమదైన పోషించిన దివంగత లింగాల కేదారి-పుష్పలత దంపతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. లింగాల కేదారి-పుష్పలత కుటుంబసభ్యులకు రూ. పది లక్షల ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సీఎం రేవంత్. కేదారి-పుష్పలత దంపతులు హనుమకొండలో సాధారణ హోటల్ నడుపుతూ, వ్యాపార కోణంతో కాకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి... ఉద్యమకారులకు ఉచితంగా ఆహారం అందించి, స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన గొప్ప మానవతావాదులు అని కొనియాడారు సీఎం రేవంత్.
అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని వృథా చేయకూడదని అవగాహన కల్పించిన మహానుభావులు ఆ పుణ్యదంపతులని...లింగాల కేదారి-పుష్పలత దంపతుల అపూర్వమైన సేవలకు గుర్తింపుగా వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసినట్లు తెలిపారు.
ఉద్యమకారులు లింగాల కేదారి-పుష్పలత కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం..!
— Revanth Reddy (@revanth_anumula) September 22, 2026
హనుమకొండలో సాధారణ హోటల్ నడుపుతూ, వ్యాపార కోణంతో కాకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి... ఉద్యమకారులకు ఉచితంగా ఆహారం అందించి, స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన గొప్ప మానవతావాదులు దివంగత లింగాల… pic.twitter.com/9a24yp0OO9
వారు అందించిన గొప్ప సేవలకు గుర్తుగా ప్రభుత్వం అందించే చిరు నివాళిగా దీనిని భావిస్తున్నానని పేర్కొన్నారు సీఎం రేవంత్.లింగాల కేదారి వంటి వ్యక్తుల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకు వీలైనంత ఎక్కువ మందికి భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు సీఎం రేవంత్.
