IND vs SA: పరువు కాపాడారు: ఆ ఇద్దరి వల్లే సిరీస్ సమం చేశాం

IND vs SA: పరువు కాపాడారు: ఆ ఇద్దరి వల్లే సిరీస్ సమం చేశాం

తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన తర్వాత సిరీస్ సమం చేయడం కష్టమే అనుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా విఫలమైన భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రతిసారిలా ఈ సారి కూడా సిరీస్ కోల్పోతారేమో అనిపించింది. కానీ కేప్ టౌన్ టెస్టులో భారత్ అంతకు మించిన విజయం అందుకొని సిరీస్ ను సమం చేసింది. భారత్ సాధించిన ఈ విజయంలో పేస్ గుర్రాలు సిరాజ్, బుమ్రా కీలక పాత్ర పోషించారు. 

తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన సిరాజ్ సఫారీలను వెన్ను విరిచాడు. ఏ దశలోనూ కోలుకోనీయకుండా చేస్తూ 55 పరుగులకు ఆలౌట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి ప్రమాదకరంగా మారుతున్న మార్కరంను బౌన్సర్ తో పెవిలియన్ కు పంపాడు. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీసుకున్న సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను గెలుచుకున్నాడు. సిరాజ్ దెబ్బకు భారత్ తొలి రోజే టెస్టుపై పట్టు బిగించింది. 

మరో పేసర్ బుమ్రా గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసుకున్న ఈ స్టార్ పేసర్ రెండో ఇన్నింగ్స్ లో మరింతగా చెలరేగి ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు. 3 వికెట్లకు  62 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా భారత పేసర్  బుమ్రా ధాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. అదే ఫామ్ ను రెండో రోజు కొనసాగించి వికెట్ కీపర్ వెర్రాయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ వెనక్కి పంపిన ఈ స్టార్ పేసర్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం ఈ మ్యాచ్ లో మొత్తం 8 వికెట్లు తీసుకున్న బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. 

గతంలో విదేశీ గడ్డపై విఫలమయ్యే మన బౌలర్లు.. ఇప్పుడు పేసర్లు వలనే విజయాలు సాధించగలుగుతున్నారు. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సార్లు సిరీస్ గెలిచినా.. ఇంగ్లాండ్ గడ్డపై వారిని చిత్తు చేసినా అంతా పేస్ బౌలర్ల కారణంగానే సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బుమ్రా, సిరాజ్ అత్యద్భుతంగా రాణిస్తున్నారు. వీరిద్దరూ భవిష్యత్తులో ఇలాగే రాణిస్తే భారత్ విదేశాల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందడంలో ఎలాంటి సందేహం లేదు.