
సిరిసిల్ల జిల్లా 9వ అడిషనల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి జయరాజ్ ఆదర్శం
సిరిసిల్ల టౌన్, వెలుగు: సర్కారు స్కూళ్లు చాలా బెటర్ అని తన ఇద్దరు బిడ్డల్ని వాటిలోనే చేర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా 9వ అడిషనల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి అంగడి జయరాజ్. ఇటీవలే మంథని నుంచి బదిలీపై వచ్చిన ఆయన స్థానిక జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో పెద్ద కూతరు జనహితను పదో తరగతిలో , చిన్న కూతురు సంఘహితను ఎనిమిదో తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల వివరాలను సేకరించి వాటిలోంచి ఈ గర్ల్స్ స్కూల్‌ను ఎంచుకున్నామన్నారు. సర్కార్ బడిలో టాలెంట్, ట్రైనింగ్ ఉన్న టీచర్లు ఉంటారని, వారిపై నమ్మకంతోనే పిల్లల్ని చేర్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి హెచ్‌ఎం రాధారాణి మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచడం మా బాధ్యతని మరింత పెంచిందని, ఈ విద్యా సంవత్సరం మంచి ఫలితాలను సాధిస్తామన్నారు.