రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: సిరిసిల్ల నేతన్నలు బట్టలనేసే పనిలో మగ్గంలో ‘నాడే’ అత్యంత కీలకం. రూ.3 కోట్లతో కలెక్టరేట్ వద్ద జంక్షన్‌ను నిర్మించి అందులో నేతన్నలు బట్టను ఉత్పత్తి చేసే విగ్రహాలను నిర్మించింది. దీనిలో భాగంగా ‘నాడే’ విగ్రహాన్ని సైతం నిర్మించింది. కొలువుదీరిన నేతన్నల విగ్రహాలను గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు.
వేములవాడలో అభివృద్ది పనులు ప్రారంభం
వేములవాడ పలు అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించనున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో బండ్ పార్క్ ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంది. మహా శివుడి విగ్రహం మరింత ఏర్పాటుతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రూ. 12 కోట్లతో రాజన్న గుడి చెరువులో బండ్ పార్క్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పార్క్ లో 40 ఫీట్ల ఎత్తైన మహాశివుడి విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాలు ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నటరాజ్ విగ్రహ ఫౌంటెన్, సూర్య నమస్కార్, వాకింగ్ ట్రాక్, కోబుల్ స్టోన్ ఫ్లోరింగ్,ల్యాండ్ స్కేప్, అంప్లీ థియేటర్, తదితర పనులు పూర్తి చేసి మొక్కలు నాటారు. మోడల్ బస్ షెల్టర్స్ రగుడు బై పాస్ జంక్షన్ వద్ద కరీంనగర్ రోడ్డులో, కామారెడ్డి రోడ్డులో రూ. 12.50 లక్షలతో మోడల్ బస్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. 1.65కోట్లతో వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించనున్నారు.
