సొంత ఖాతాలకు రూ.2.6 కోట్లు మళ్లింపు ..ఎస్ఐఎస్ పీఎల్ రిటైల్ ఉద్యోగిపై కేసు

సొంత ఖాతాలకు రూ.2.6 కోట్లు మళ్లింపు ..ఎస్ఐఎస్ పీఎల్ రిటైల్ ఉద్యోగిపై కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: ఓ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి.. నకిలీ బిల్స్​తయారు చేసి, ఆ కంపెనీ బ్యాంక్​అకౌంట్​నుంచి రూ.2.6 కోట్లను కాజేశాడు. బంజారా హిల్స్​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్–2 లో ఎస్ఐఎస్​పీఎల్ రిటైల్​కంపెనీ ఆఫీస్​ఉంది.

 హిల్ టాప్ కాలనీ ఎర్రమంజిల్ లో నివాసం ఉండే మంచిగంటి కృష్ణ వరప్రసాదరావు అందులో ఉన్నత హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి నకిలీ బిల్స్ తయారు చేశాడు. 

వాటి ఆధారంగా కంపెనీ యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.2.6 కోట్లను తనతోపాటు తన కుటుంబసభ్యులకు చెందిన బ్యాంక్ ఖాతాలకు మళ్లించాడు. కంపెనీ ఆడిట్ లో కృష్ణ వరప్రసాదరావు మోసపూరిత లావాదేవీలు, అధికార దుర్వినియోగం బయటపడింది. దీంతో హెచ్ఆర్, ఏజీఎం రాజేశ్​గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణ వరప్రసాదరావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.