TSPSC : బండికి ఇంటికి మరోసారి సిట్.. మహా ధర్నా సమయంలోనే.. 

TSPSC : బండికి ఇంటికి మరోసారి సిట్.. మహా ధర్నా సమయంలోనే.. 

టీఎస్ పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీలతో నష్టపోయిన 30 లక్షల మంది స్టూడెంట్స్ కు అండగా.. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నాకు వెళ్లబోతున్న సమయంలోనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. మార్చి 25వ తేదీ శనివారం ఉదయం సిట్ అధికారులు.. ఆయన ఇంటికొచ్చి మరీ నోటీసులు జారీ చేయటం కలకలం రేపుతోంది. ఇంత హడావిడిగా ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వటం ఏంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. మహాధర్నా ఉందని తెలిసి.. ధర్నాకు వెళుతున్నారనే విషయం తెలిసే అధికారులు ఇంటికొచ్చి నోటీసులు జారీ చేశారనేది బీజేపీ వాదనగా ఉంది. 

బండి సంజయ్ ఈనెల 26 తారీఖున సిట్ ముందు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బండి సంజయ్ కు 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని నోటీసులో అధికారులు తెలిపారు. 

పేపర్ లీకేజీల్లో ప్రభుత్వం పాత్ర ఉందని.. మంత్రి కేటీఆర్ దగ్గర ఉండే వ్యక్తుల పాత్ర ఉందనే ఆరోపణలు చేశారు బండి. ఈ క్రమంలోనే ఆధారాలు ఇవ్వాలంటూ..ఇటీవల సిట్ అధికారులు ఆయనకు మొదటిసారి నోటీస్ ఇచ్చారు. 24వ తేదీ  సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. బండి సంజయ్  సిట్ అధికారుల దగ్గరకు వెళ్లలేదు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదంటున్నారాయన. సిట్ అధికారులకు ఆధారాలు ఇవ్వనని.. సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందువల్ల తాను రాలేకపోయానని బండి సంజయ్ చెప్పడంతో.. మార్చి 25వ తేదీ మరో మరోసారి ఆయన ఇంటికెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.