మహిళా సాధికారతకు సీతక్క చిరునామా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

 మహిళా సాధికారతకు సీతక్క చిరునామా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా సాధికారత ఉద్యమంలా ముందుకు సాగుతోందని గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా స్వయంసహాయక బృందాలు నిర్వహిస్తున్న స్టాళ్లు చాలా బాగున్నాయన్నారు. శిల్పారామం ఇందిరా మహిళా శక్తి బజారులో కొనసాగుతున్న సరస్ మేళాను గవర్నర్ సోమవారం సందర్శించారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్  మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు మంత్రి సీతక్క చిరునామాగా మారారని కితాబిచ్చారు. సీతక్క చాలా సిన్సియర్, హార్డ్ వర్కర్ అని ఆమె గురించి నేను ఎక్కడికి వెళ్లినా చెప్తూ ఉంటానన్నారు.