IND vs ENG 2025: చివరి రోజు పంత్ బ్యాటింగ్‌కు వస్తాడా..? టీమిండియా బ్యాటింగ్ కోచ్ క్లారిటీ

IND vs ENG 2025: చివరి రోజు పంత్ బ్యాటింగ్‌కు వస్తాడా..? టీమిండియా బ్యాటింగ్ కోచ్ క్లారిటీ

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా డ్రా కోసం అద్భుతంగా పోరాడుతోంది. ఓపెనర్ రాహుల్, కెప్టెన్ శుభమాన్ గిల్ అసమానంగా పోరాడుతున్నారు. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును వీరిద్దరి భాగస్వామ్యం ఆదుకుంది. 62 ఓవర్ల పాటు వీరిద్దరూ బ్యాటింగ్ చేయడంతో ఓడిపోయే మ్యాచ్ లో టీమిండియా డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. గిల్, రాహుల్ ఐదో రోజు కూడా పట్టుదల చూపిస్తే టీమిండియా ఈ మ్యాచ్ ఓటమి నుంచి గట్టెక్కవచ్చు. ఈ మ్యాచ్ లో భారత జట్టు మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే గిల్, రాహుల్ తో పాటు పంత్ బ్యాటింగ్ చేయడం కీలకంగా మారనుంది.  

తొలి ఇన్నింగ్స్ లో కాలి వేలి గాయంతో ఇబ్బంది పడిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు బరిలోకి దిగుతాడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ క్లారిటీ ఇచ్చాడు. పంత్ ఐదో రోజు బ్యాటింగ్ చేస్తాడని కన్ఫర్మ్  చేశాడు. 4వ రోజు తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ పంత్ అందుబాటులో ఉన్నాడని ధృవీకరించాడు.  దీంతో ఫ్యాన్స్ కు బిగ్ రిలీఫ్ కలిగింది. పంత్ గాయపడడంతో అతని స్థానంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ కు బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. దీంతో జట్టు కోసం ఖచ్చితంగా బ్యాటింగ్ కు రావాల్సి ఉంది. 

అసలేం జరిగిందంటే..?

ఇంగ్లాండ్, ఇండియా మధ్య బుధవారం (జూలై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోర్ 141 పరుగుల వద్ద గిల్ ఔటైనప్పుడు పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు. తనదైన శైలిలో ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చూపంచాడు. 48 బంతుల్లోనే 2 ఫోర్లు, సిక్సర్ తో 37 పరుగులు చేసి దూకుడు మీదున్నాడు. ఈ సమయంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. మూడో సెషన్‎లో వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 68 ఓవర్ మూడో బంతికి రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించే క్రమంలో పంత్ పాదానికి తీవ్ర గాయమైంది. కుడి పాదం వాయడంతో పాటు కొంచెం రక్తం కూడా వచ్చింది. 

ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ పంత్ నడవలేకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. పంత్ రిటైర్డ్ హార్ట్‎గా వెళ్లిపోవడంతో అతని స్థానంలో జడేజా బ్యాటింగ్‎కు వచ్చాడు. మూడో టెస్టులో చేతి వేలి గాయంతో ఇబ్బందిపడిన పంత్‎కు.. మాంచెస్టర్ టెస్టులో కాలికి గాయం కావడం విచారకరం. ఈ సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న పంత్ వరుసగా గాయపడటంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్, పంత్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

►ALSO READ | చైనా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–1000 టోర్నీ: సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ జోడీ ఓటమి

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో నాలుగో టెస్టులో  ఓటమి తప్పించుకునేందుకు ఇండియా పోరాడుతోంది.  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేయడంలో బౌలర్లు ఫెయిలైనా.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (210 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లతో 87 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (167 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లతో 78 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) నిలబడ్డారు. రెండు సెషన్ల పాటు వికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఫలితంగా 311 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఇండియా శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో 174/2 స్కోరు చేసింది. 

ప్రస్తుతానికి టీమిండియా ఇంకా 137 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది. ఆఖరి రోజు మూడు సెషన్లు ఆడితేనే ఇండియా డ్రాతో గట్టెక్కగలదు. వెనకబడి ఉంది. ఆఖరి రోజు మూడు సెషన్లు ఆడితేనే ఇండియా డ్రాతో గట్టెక్కగలదు.  లేదంటే మ్యాచ్‌‌తో పాటు సిరీస్ ఓటమి తప్పదు. ఆదివారం తొలి సెషన్‌‌‌‌‌‌‌‌ ఆట జట్టుకు కీలకం కానుంది.  అంతకుముందు 544/7 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు వద్ద ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 157.1 ఓవర్లలో 669 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ జట్టు 311 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ను సాధించింది.