సితార బ్యానర్‌‌‌‌‌‌‌‌లో ఐదోసారి మీనాక్షి చౌదరి

సితార బ్యానర్‌‌‌‌‌‌‌‌లో  ఐదోసారి మీనాక్షి చౌదరి

టాలీవుడ్‌‌‌‌లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న  హీరోయిన్ మీనాక్షి చౌదరి మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌ను దక్కించుకుంది.   ముఖ్యంగా సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌తో ఆమెకు ఏర్పడిన అనుబంధం ఇప్పుడు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఈ సంస్థలో   గుంటూరు కారం, లక్కీ భాస్కర్, అనగనగా ఒకరాజు  చిత్రాల్లో మీనాక్షి చౌదరి నటించింది. ప్రస్తుతం ఇదే బ్యానర్‌‌‌‌‌‌‌‌లో  దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న  ఓ వెబ్ సిరీస్‌‌‌‌లో కూడా మీనాక్షి నటిస్తోంది.  ఇప్పుడు అదే బ్యానర్‌‌‌‌లో ఐదో ప్రాజెక్ట్‌‌‌‌కు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.  రీసెంట్‌‌‌‌గా  సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్  మరో భారీ ప్రాజెక్ట్‌‌‌‌ను ప్రకటించింది. 

తమిళ స్టార్ హీరో కార్తీ  హీరోగా  ‘మ్యాడ్’ ఫేమ్  కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది.  ఈ కాంబినేషన్‌‌‌‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనిపై  అధికారిక ప్రకటన రావాల్సి  ఉన్నప్పటికీ, సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ మీనాక్షి చౌదరి తమ ఫేవరెట్ హీరోయిన్‌‌‌‌గా మారిపోయిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.  మరోవైపు మీనాక్షి చౌదరి ప్రస్తుతం నాగచైతన్యకు జంటగా ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తోంది.  ‘విరూపాక్ష’  ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి.