జమ్మూలో పేలుళ్లు.. ఆరుగురికి గాయాలు

జమ్మూలో పేలుళ్లు.. ఆరుగురికి గాయాలు

జమ్మూలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నర్వాల్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు చోట్ల పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలుకాగా.. వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఈ పేలుళ్లు జరగడం భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీం.. ఆధారాలు సేకరిస్తోంది. పేలుళ్ల అనంతరం భద్రతాబలగాలు ఆ ఏరియాలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అటువైపు వచ్చే ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. 

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టింది. జనవరి 30న శ్రీనగర్లో పాదయాత్ర ముగియనుంది. భారత్ జోడో యాత్రకు ఇవాళ బ్రేక్ ఇవ్వగా.. రేపట్నుంచి యధావిధిగా కొనసాగనుంది.