
ఇండోర్: ఇండోర్‌లో పాటల్‌పని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో తాత్కాలిక లిఫ్ట్ కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్ పాటల్‌పనిలోని తన ఫామ్ హౌస్‌లో ఓ భవంతిని నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ పనులు చూడటానికి కుటుంబసభ్యులతో కలిసి ఆయన మంగళవారం అక్కడికి వెళ్లారు. వారంతా కలిసి లిఫ్ట్‌లో భవనం పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లిఫ్ట్‌లో వారు పైకి చేరుకోగానే ఉన్నట్లుండి లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి కూలిపోయింది. లిఫ్ట్‌లో ఉన్నవారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. నిధి అగర్వాల్ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.