- 10 మందికి పైగా గాయాలు.. చత్తీస్‌గఢ్‌లో ఘటన
బలోదబజార్: చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బలోదబజార్ -భటపారా జిల్లాలోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. ప్లాంట్‌లోని దుమ్మును తొలగించే గదిలో పేలుడు సంభవించిందని.. ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురికి మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయని కలెక్టర్ దీపక్ సోని తెలిపారు.
పోలీసులు, జిల్లా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారని, గాయపడిన కార్మికులను బిలాస్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి శ్యామ్ బిహారీ జైస్వాల్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
