డిస్కస్‌‌‌‌ త్రోలో కమల్‌‌‌‌ప్రీత్‌‌‌‌కు ఆరో ప్లేస్​

డిస్కస్‌‌‌‌ త్రోలో కమల్‌‌‌‌ప్రీత్‌‌‌‌కు ఆరో ప్లేస్​

టోక్యో: ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో బరిలోకి దిగిన డిస్కస్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ కమల్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌.. మెడల్‌‌‌‌ తేకున్నా మంచి పెర్ఫామెన్స్‌‌‌‌ చూపెట్టింది. సోమవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిస్క్‌‌‌‌ను 63.70 మీటర్ల దూరం విసిరిన కౌర్‌‌‌‌ ఆరో స్థానంలో నిలిచింది. గంటపాటు వర్షం అంతరాయం కలిగించడంతో అథ్లెట్లు కాస్త ఇబ్బందిపడ్డారు. మొత్తం 8 ప్రయత్నాల్లు జరగ్గా.., కౌర్‌‌‌‌ మూడోసారి అత్యధికంగా 63.70 మీటర్ల దూరాన్ని సాధించింది. దీంతో 2012 ఒలింపిక్స్‌‌‌‌లో కృష్ణ పూనియా బెస్ట్​ పెర్ఫామెన్స్‌‌‌‌ను సమం చేసింది.

షూటర్లు.. సున్నా
భారీ ఆశలు పెట్టుకున్న ఇండియా షూటర్లు   వరుసగా రెండో ఒలింపిక్స్‌‌‌‌లోనూ మెడల్‌‌‌‌ లేకుండా తిరిగొచ్చారు.  మెన్స్‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌ 3 ప్రోన్‌‌‌‌ పొజిషన్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ప్రతాప్‌‌‌‌ తోమర్‌‌‌‌, సంజీవ్‌‌‌‌ రాజ్‌‌‌‌పుత్‌‌‌‌.. ఫైనల్‌‌‌‌ చేరలేకపోయారు. క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో తోమర్‌‌‌‌ 1167 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచాడు. ఇక మూడోసారి ఒలింపిక్స్‌‌‌‌ ఆడుతున్న రాజ్‌‌‌‌పుత్‌‌‌‌ 1157 పాయింట్లతో 32వ ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌‌‌‌ కటాఫ్‌‌‌‌ 1176 కావడంతో వీళ్లకు నిరాశ తప్పలేదు.  

ద్యుతీకి తప్పని నిరాశ
ఇండియా టాప్‌‌‌‌ స్ప్రింటర్‌‌‌‌ ద్యుతీ చంద్‌‌‌‌ మరోసారి నిరాశ పరిచింది.  విమెన్స్‌‌‌‌ 200 మీటర్ల రేస్‌‌‌‌లో ఆమె సెమీస్‌‌‌‌కు కూడా అర్హత సాధించలేదు. హీట్‌‌‌‌–4లో బరిలోకి దిగిన ద్యుతీ 23.85 సెకండ్లలో రేస్‌‌‌‌ను ఫినిష్‌‌‌‌ చేసి ఏడో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. టాప్‌‌‌‌–3 మాత్రమే సెమీస్‌‌‌‌కు క్వాలిఫై అవుతారు. మొత్తం 41 మంది పోటీపడ్డ ఈవెంట్‌‌‌‌లో ద్యుతీ 38వ ప్లేస్‌‌‌‌లో నిలిచి ంది. ఇక, ఈక్వెస్ట్రియన్‌‌‌‌లో ఇండియా తరఫున ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించిన ఫవాద్‌‌‌‌ మీర్జా.. చివరి మెట్టుపై ఆకట్టుకోలేకపోయాడు. జంపింగ్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో 23వ ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో మీర్జా 12.40 పెనాల్టీలతో ఓవరాల్‌‌‌‌గా 59.60 పాయింట్లు సాధించాడు.