
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో స్వల్ప మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. శంషాబాద్, జల్పల్లి, శామీర్‌పేట ప్రాంతాల్లోని ఉద్యోగులకు 24 శాతానికి హెచ్ఆర్ఏను పెంచారు. గతంలో 13 శాతం హెచ్ఆర్ఏ ఉన్నది. జీహెచ్ఎంసీ నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పెంచిన హెచ్ఆర్ఏ వర్తింస్తుందని జీవోలో పేర్కొన్నారు. హెచ్ఆర్ఏ పెంపును టీఎన్జీవో నేతలు స్వాగతించారు.సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావులకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ ధన్యవాదాలు తెలిపారు.