చిన్న బడ్జెట్ మూవీస్..హై కలెక్షన్స్.. టాప్ 3 లో బేబీ

చిన్న బడ్జెట్ మూవీస్..హై కలెక్షన్స్.. టాప్ 3 లో బేబీ

ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnawi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ యూతుఫుల్ ఎంటెర్టైనర్ బేబీ(Baby). కలర్ ఫోటో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్(Sai rajesh) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

లేటెస్ట్ గా ఈ మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిన్న మూవీస్ లో టాప్ 3 మూవీగా నిలిచింది. బేబీ మూవీ రూ.7. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా..రూ. 33.57 కోట్ల లాభం వచ్చింది. టాప్ 1 లో విజయ్ దేవరకొండ గీత గోవిందం మూవీ రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా రూ.55.43 కోట్ల కలెక్షన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. టాప్ 2 లో కార్తీకేయ మూవీ ఉండగా అది రూ.45 కోట్ల లాభాన్ని గడించింది.

కాగా రీసెంట్ గా బేబీ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంది. ఈ మూవీలోని అందమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, హృదయాన్ని హాత్తుకునే బలమైన సంభాషణలు, ఎమోషనల్ మ్యూజిక్.. కలిపి బేబీ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిపాయి. ఇక బేబీ పాత్రలో నటించిన వైష్ణవి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.