రిలయన్స్ నుంచి స్మార్ట్​ కరెంట్​ మీటర్లు

రిలయన్స్ నుంచి స్మార్ట్​ కరెంట్​ మీటర్లు

డిస్కమ్​లకు మీటర్​ బిల్లింగ్​ సహా పలు సేవలు

ఇందుకోసం జియో డిజిటల్​ అసెట్స్ వాడకం

న్యూఢిల్లీ: రిలయన్స్​ ఇండస్ట్రీస్‌​ స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటర్ల బిజినెస్​లోకి ఎంటర్​ కావాలని కోరుకుంటోంది. ఇందుకోసం తన జియో బిజినెస్​ను వాడుకోనుంది. ఈ బిజినెస్​ ద్వారా కరెంటు డిస్ట్రిబ్యూషన్​ కంపెనీలకు మీటర్​ డేటా కలెక్షన్​, కమ్యూనికేషన్​ కార్డ్స్​, టెలికం, క్లౌడ్​ హోస్టింగ్​ సర్వీసులను అందించనుంది. డిస్ట్రిబ్యూషన్​ నష్టాలను తగ్గించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటరింగ్​ ప్రోగ్రామ్​ను అమలు చేస్తున్న నేపథ్యంలో రిలయన్స్​ ఈ సెగ్మెంట్​లోకి వస్తోంది. దేశవ్యాప్తంగా 25 కోట్ల సాధారణ మీటర్లను తొలగించి స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటర్లను బిగించడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల డిస్కమ్​లకు రూ.1.38 లక్షల కోట్ల రెవెన్యూలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిలినియర్​ ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ అడ్వాన్స్​డ్​ మీటరింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను (ఏఎంఐ) బిజినెస్​లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. న్యారో బ్యాండ్​ ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​ టెక్నాలజీ ద్వారా సేవలు అందిస్తామని చెబుతోంది. స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటర్లకు రెండువైపులా కమ్యూనికేషన్​ జరిపే నెట్​వర్క్​, కంట్రోల్ సెంటర్​ ఎక్విప్​మెంట్​, డేటా సేకరణ కోసం సాఫ్ట్​వేర్​ అప్లికేషన్లు అవసరం. నిజానికి న్యారోబ్యాండ్ టెక్నాలజీని మొబైల్​ నెట్​వర్కులు, సర్వీసుల కోసం తయారు చేశారు. అయితే, స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటర్ల బిజినెస్​లోకి రావడంపై అడిగిన ప్రశ్నలకు రిలయన్స్​ ప్రతినిధి రెస్పాండ్​ కాలేదు.

స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటర్లతో లాభాలు ఏమిటంటే..

స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటర్ల వల్ల మనుషులు ఇండ్లకు వచ్చి రీడింగ్​ తీయాల్సిన అవసరం ఉండదు. బిల్లింగ్​, కలెక్షన్​ ఆన్​లైన్​లోనే జరుగుతాయి. కరెంటు చోరీలను ఈజీగా గుర్తించవచ్చు.  ఇలాంటి సేవలు అందించడానికి రిలయన్స్​ రెడీగా ఉందని ఈ విషయం తెలిసిన వ్యక్తి చెప్పారు. జియో దగ్గర క్లౌడ్​, ఎడ్జి కంప్యూటింగ్​, డేటా ఎనలిటిక్స్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, మెషీన్​ లెర్నింగ్​, బ్లాక్​చెయిన్​, ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​ వంటి టెక్నాలజీలు ఉండటమే ఇందుకు కారణం. మోడీ ప్రభుత్వం ప్రపోజ్​ చేసిన రూ.3.5 లక్షల కోట్ల డిస్ట్రిబ్యూషన్​ రిఫామ్​ స్కీమ్​కు స్మార్ట్​ ఎలక్ట్రిక్​ మీటర్లు కీలకమని పవర్​ సెక్టార్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు.

For More News..

ఆధార్​ పీవీసీ కార్డులో ఎన్నో ఫీచర్లు.. రూ.50 చెల్లిస్తే కార్డు ఇంటికే..

40 ఏళ్లకే బిలినియర్లుగా మనవాళ్లు

దేశాల మధ్య ముదురుతున్న సైబర్ వార్

మహారాష్ట్ర గవర్నర్, సీఎంల మధ్య లెటర్ల యుద్ధం