ఈ మధ్య చాలామంది ఇండ్లను స్మార్ట్ హోమ్స్‌గా మార్చేస్తున్నారు. కొందరి ఇండ్లలో ఏ మూల చూసినా స్మార్ట్ గాడ్జెట్స్ కనిపిస్తుంటాయి. వీటి వాడకం పెరుగుతున్న కొద్దీ కంపెనీలు కూడా రోజుకో కొత్త గాడ్జెట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇలాంటి గాడ్జెట్స్ వాడితే పనులన్నీ ఈజీ అయిపోతాయి. ఆఫీస్‌లో ఉండి.. ఇంట్లో ఉన్న ఫ్యాన్ స్విచాఫ్ చేయొచ్చు. మనం ఎక్కడున్నా ఇంటికి ఎవరొచ్చారో తెలుసుకోవచ్చు. ఈ గాడ్జెట్స్‌తో ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చే ఆలోచనలో ఉంటే ఈ గాడ్జెట్స్‌పై ఓ లుక్కేయండి.
సీలింగ్ ఫ్యాన్
ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్లు కూడా ‘స్మార్ట్’ అయిపోయాయి. ఓరియంట్ కంపెనీ ‘‘ఎలక్ట్రిక్ ఏరోస్లిమ్” పేరుతో ఒక స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది మామూలు ఫ్యాన్లతో పోలిస్తే దాదాపు 40 శాతం పవర్‌ని సేవ్ చేస్తుంది. దీన్ని ఇన్వర్టర్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. మొబైల్ యాప్‌తో ఆపరేట్ చేయొచ్చు. టర్బో, స్లీప్, బ్రీజ్ అని మూడు రకాల స్పీడ్ మోడ్స్ ఉంటాయి. అంతేకాదు.. స్లీప్ టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే రోజులో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫ్యాన్ తిరగాలనేది ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. దీనికి అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వాయిస్‌తో కమాండ్స్ ఇవ్వొచ్చు.
ధర: 10,820 రూపాయలు
విప్రో ప్లగ్
గీజర్, ఫ్రిడ్జ్, ఏసీల్లాంటి పెద్ద అప్లయెన్సెల కోసం ఈ ప్లగ్‌ని డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ ప్లగ్‌ని16A ప్లగ్‌కి కనెక్ట్ చేసి, ఈ ప్లగ్ నుంచి ఏ డివైజ్‌కైనా పవర్ కనెక్షన్ ఇవ్వొచ్చు. ఈ స్మార్ట్ ప్లగ్‌ని మొబైల్‌యాప్, అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో ఆపరేట్ చేయొచ్చు. ఉదాహరణకు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేయాలనుకుంటే దారిలో ఉన్నప్పుడే మొబైల్‌తో గీజర్ ఆన్ చేయొచ్చు. ఇంటికి వచ్చేలోపు నీళ్లు వేడెక్కుతాయి. కాకపోతే ఇంటర్‌నెట్ ఉండాలంతే.
ధర: 969 రూపాయలు
వీడియో డోర్ బెల్
ఇంటి డోర్ బెల్ సౌండ్ వినిపించగానే వచ్చిందెవరో తెలుసుకోవాలని.. దర్వాజ సందులో నుంచి చూసే రోజులు పోయాయి. బెల్ మోగగానే మొబైల్ వైపు చూస్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీతో డోర్ బెల్ కొడుతున్న వ్యక్తిని లైవ్‌లో చూడొచ్చు. అలాంటి టెక్నాలజీతో తయారు చేసిందే ఈ ‘‘క్యూబో స్మార్ట్ వీడియో డోర్ బెల్’’. దీన్ని డోర్ బెల్ స్విచ్ ప్లేస్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత దీనికి సంబంధించిన యాప్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని, బెల్‌తో కనెక్ట్ చేయాలి. బెల్‌ని ఎవరైనా నొక్కితే.. మనం ఇంట్లో ఉన్నా, లేకపోయినా వెంటనే మొబైల్‌కు వీడియో కాల్ వస్తుంది. కాల్ యాక్సెప్ట్ చేసి, డోర్ బయట ఉన్న వాళ్లతో మాట్లాడొచ్చు. మనం మాట్లాడే మాటలు ఈ బెల్ నుంచి వాళ్లకు వినిపిస్తాయి. అంతేకాదు.. ఇది సెక్యూరిటీ కెమెరాగా కూడా పనిచేస్తుంది. లైవ్ మోడ్‌లో పెట్టుకుంటే.. ఇంటి గుమ్మం ముందు నుంచి మొబైల్‌కి లైవ్ ఫుటేజీ ఇస్తుంది. ఇందులో 36 ట్యూన్స్ ఉంటాయి. నచ్చిన ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని అమెజాన్ అలెక్సాతో కూడా కంట్రోల్ చేయొచ్చు.
ధర: 6,970 రూపాయలు
స్విచ్ కన్వర్టర్
ఫ్యాన్, లైట్, టీవీ ఇలా ఏది ఆన్, ఆఫ్ చేయాలన్నా కూర్చున్న చోటి నుంచి లేవాలి. ఆఫ్ చేయడం మర్చిపోయి బయటికి వెళ్తే వచ్చే వరకు అవి అలాగే నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు టాటా కంపెనీ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ స్విచ్ కన్వర్టర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. దీన్ని ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్‌లోనే ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మూడు డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫ్యాన్, టీవీ, బల్బ్ స్విచ్‌లకు ఈ గాడ్జెట్‌ని కనెక్ట్ చేస్తే.. వాటన్నింటినీ మొబైల్ యాప్ నుంచే ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. ఇలా పనిచేయాలంటే దీనికి వైఫై యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది.
ధర: 1,660 రూపాయలు
