కరోనా నుంచి కోలుకున్నోళ్లకు స్మెల్​ ప్రాబ్లమ్స్​

V6 Velugu Posted on Oct 17, 2021

  • పరోస్మియా డిసీజ్ తో ఇబ్బందులు
  • బ్యాడ్ స్మెల్ తో తిండి తినలేక తిప్పలు 


హైదరాబాద్, వెలుగు: కరోనా బాధితులను మరో కొత్త రోగం ఇబ్బంది పెడుతోంది. వాళ్లు అన్నం, కూర, కాఫీ, సెంట్ సహా దేని స్మెల్ చూసినా గబ్బు వాసన వస్తోంది. కంపు వాసన వస్తుండడంతో తిండి తినలేకపోతున్నామని డాక్టర్ల దగ్గరికి బాధితులు పరుగులు పెడుతున్నారు. ఇలా దేని వాసన చూసినా గలీజ్ గా రావడాన్ని మెడిసిన్ లో పరోస్మియా అంటారు. కరోనాకు ముందు పరోస్మియా బాధితులు చాలా రేర్‌‌‌‌గా ఉండేవారని, కరోనా తర్వాత కేసులు పెరిగాయని ఈఎన్‌‌టీ స్పెషలిస్టులు చెబుతున్నారు. మూర్చ, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఇంజూరి, ఇన్ఫెక్షన్ల వల్ల మనం వాసన చూడ్డానికి ఉపయోగపడే నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ నరాలు దెబ్బతిన్నప్పుడు కొంతమంది పూర్తిగా వాసన కోల్పోతారు. కొంతమందికి అన్ని వాసనలు ఒకేలా కంపుగా వస్తాయి. కరోనా బారినపడిన చాలా మందిలో వాసన, రుచి కోల్పోవడం తెలిసిందే. అయితే మెజారిటీ బాధితులకు వారం లేదా పది రోజుల్లోనే వాసన, రుచి తిరిగొచ్చాయి. వీరిలో కొద్దిమంది మాత్రం వైరస్‌‌ నుంచి కోలుకున్న తర్వాత కొన్నాళ్లకు ఇలా బ్యాడ్ స్మెల్ బాధితులు అవుతున్నారు. 

నో ట్రీట్‌‌మెంట్..
పరోస్మియాకు, కరోనాకు ఉన్న సంబంధంపై ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ లు జరుగుతున్నాయని, కానీ ఇప్పటివరకు సరైన కారణం కనుక్కోలేకపోయారని డాక్టర్లు చెబుతున్నారు. ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే 3 నుంచి 6 నెలల పాటు ఉంటుందంటున్నారు. బ్యాడ్ స్మెల్ తో బాధితులేమీ తినలేక పోతున్నారని, దీంతో కొత్త రోగాలు వస్తున్నాయని.. పరోస్మియా వల్ల నేరుగా జరిగే ప్రమాదమేమీ లేదని డాక్టర్లు పేర్కొంటున్నారు. కరోనా తరహాలోనే పరోస్మియాకు కూడా పూర్తిస్థాయి ట్రీట్‌‌మెంట్ అందుబాటులో లేదని.. స్టెరాయిడ్ స్ర్పే, స్మెల్ థెరపీ కొంతమేర పని చేస్తున్నాయని అంటున్నారు. స్టెరాయిడ్‌‌ స్ప్రే వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉండడంతో, ఎక్కువ మంది స్మెల్ థెరపీ చేయించుకుంటున్నారు. 

ఎవరికైనా రావొచ్చు.. 
కరోనా సివియారిటీ, ఏజ్‌‌, కోమార్బిడ్ కండీషన్స్‌‌తో సంబంధం లేకుండా అందరూ పరోస్మియాతో బాధ పడుతున్నారు. నేను 20 మంది పేషెంట్స్‌‌ను చూశా. కొంత మందికి స్టెరాయిడ్ స్ర్పే ఇచ్చాం. మరికొంత మందికి స్మెల్ థెరపీ చేయిస్తున్నాం. ఈ థెరపీలో భాగంగా రోజూ గులాబీ, లెమన్‌‌, యుకలిప్టస్‌‌(నీలగిరి), లవంగం ఫ్లేవర్ల సెంట్‌‌ స్మెల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నరాలు యాక్టివేట్ అయి స్మెల్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
- డాక్టర్‌‌‌‌ మనుశృత్, ఈఎన్‌‌టీ స్పెషలిస్ట్, సోమాజిగూడ

Tagged health, coronavirus, corona recovery, corona problems, smell problem

Latest Videos

Subscribe Now

More News